బిగ్ బాస్ 5 : రవి పారితోషికం ఎంత అందుకున్నాడంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“బిగ్ బాస్ 5” చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలోనే షోలో ట్విస్టులు, కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. నవంబర్ 28న జరిగిన ఎలిమినేషన్ రౌండ్ లో తన అభిమానులను షాక్ కు గురి చేస్తూ ప్రముఖ యాంకర్ రవి నిన్న రాత్రి బిగ్ బాస్ హౌస్ నుండి నిష్క్రమించాడు. దీంతో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ను ఎలా ఎలిమినేట్ చేస్తారంటూ ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా షో నిర్వాహకులపై మండిపడుతున్నారు. రవి ఓటింగ్ శాతాన్ని అధికారికంగా రివీల్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు అన్నపూర్ణ స్టూడియో వద్ద ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి.
Read Also : “పుష్ప” ట్రైలర్ అప్డేట్… వైల్డెస్ట్ మాస్ ఫెస్టివల్ ఎప్పుడంటే ?
Also Read
ఈ నేపథ్యంలో బిగ్ బాస్ నిర్వాహకులు రవికి భారీ రెమ్యునరేషన్ ఇవ్వాల్సి వస్తుందనే కారణంగానే ఎలిమినేట్ చేశారని ఆరోపించడంతో పాటు పలు ఊహాగానాలు చేస్తున్నారు. ఈ సీజన్ లో హౌస్‌లో అత్యధిక పారితోషికం పొందిన కంటెస్టెంట్స్ లో రవి ఒకరు. బిగ్ బాస్ మేకర్స్ ఒక్క వారానికి రవికి రూ.7 నుంచి 8 లక్షలు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. 12 వారాల్లో ఆయన మొత్తం రెమ్యునరేషన్ దాదాపు రూ.1 కోటికి చేరుకోవడంతో, టైటిల్ గెలవగల మంచి పోటీదారులలో రవి ఒకడు అయినప్పటికీ ఆయనకు ఎగ్జిట్ డోర్ చూపించారని ఆయన అభిమానులు మండిపడుతున్నారు.
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
-
India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!