బిగ్ బాస్ 5 : ఈ వారం ఎలిమినేషన్ షాక్ ఎవరికంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“బిగ్ బాస్ 5” ఇంకా రెండు వారాలు మాత్రమే మిగిలింది. ఫైనల్స్ చేరుకున్న ఈ షో గురించి ఎప్పటికప్పుడు లీక్స్ వస్తూనే ఉన్నాయి. ఈవారం ఎలిమినేషన్ విషయంలో కూడా లీక్స్ తో పాటు అందరూ అనుకున్నదే జరిగింది. అంతా ఊహించినట్లుగానే “బిగ్ బాస్ తెలుగు సీజన్ 5” 13వ వారంలో ప్రియాంక సింగ్ అకా పింకీ ఎలిమినేట్ అయింది. ప్రియాంక సింగ్ “జబర్దస్త్” కామెడీ షోలో గుర్తింపు తెచ్చుకున్న ట్రాన్స్‌జెండర్. ‘బిగ్ బాస్’ హౌస్‌లో తన సత్తా చాటి ప్రియాంక సింగ్ పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించుకుంది.
Read Also : సితారకు ఆ సన్నివేశాలు అస్సలు నచ్చవు : మహేష్ బాబు
Also Read
బిగ్ బాస్ హౌస్‌లోని అందరితో పోలిస్తే ప్రియాంక సింగ్ బలహీనమైన కంటెస్టెంట్ అని చెప్పొచ్చు. కానీ మానస్‌తో ఆమె స్నేహం ఇంట్లో 13 వారాలు ఉండడానికి సహాయ పడింది. హౌజ్ లో ఆమె మంచి ప్రవర్తనతో అందరితో మంచిగా ఉంటుంది. టాస్క్‌లలో ఆమె పనితీరు అంతగా బాగాలేకపోయినా, ఆమె ఇతరులను ఎప్పుడూ నొప్పించలేదు. నిజానికి 10వ వారం తర్వాత ప్రియాంక ఎలిమినేట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఆశ్చర్యకరంగా హౌజ్ లో ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ రవి, అనీ షో నుండి ఎలిమినేట్ అయ్యారు. కానీ ప్రియాంక ఇప్పటి వరకూ రాణించింది. ప్రియాంక ఎలిమినేషన్‌తో బిగ్ బాస్ హౌస్‌లో ప్రస్తుతం 6 మంది సభ్యులు ఉన్నారు.
ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో శ్రీరామ్, మానస్, సన్నీ, కాజల్, సిరి, షణ్ముఖ్ ఉన్నారు. శ్రీరామ చంద్ర ఇప్పటికే ఫైనల్‌కు టిక్కెట్‌ను దక్కించుకున్నాడు. వచ్చే వారం చివరికల్లా గ్రాండ్ ఫినాలేలో మిగతా వారిపై క్లారిటీ వస్తుంది.
తాజావార్తలు
-
Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లో 3 వికెట్లు, టీ20లో నంబర్-1 బౌలర్‌గా..
-
Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
-
Brad Pitt : ఏంజెలీనా జోలీని వివాహం చేసుకోవడమే నా జీవితంలో అతిపెద్ద తప్పు
-
Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!