బిగ్ బాస్ తెలుగు విజయవంతంగా 11 వారాలు పూర్తి చేసుకుని 12వ వారంలోకి అడుగు పెట్టింది. హౌస్‌లోకి ప్రవేశించిన 19 మంది పోటీదారులలో 11 మంది ఎలిమినేట్ అయ్యారు. ఎనిమిది మంది గేమ్‌లో మిగిలి ఉన్నారు. ఈ ఎనిమిది మంది హౌస్‌మేట్స్ ఫైనల్ టాప్ ఫైవ్‌లో ఉండేందుకు పోటీ పడుతున్నారు. కాగా 12వ వారానికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ నిన్న రాత్రి జరగగా ఈ ఎపిసోడ్ ఈరోజు రాత్రికి ప్రసారం కానుంది. ప్రోమో ప్రకారం బిగ్ బాస్ పోటీదారుల ముందు కుండ పగలగొట్టి ఒక్కొక్కరు రెండు నామినేషన్లను ఎంచుకోమని కోరారు. ప్రతి వారం మాదిరిగానే ఈసారి కూడా పోటీదారుల మధ్య తీవ్ర వాగ్వాదాలు జరిగాయి. కాజల్-రవి, సిరి-ప్రియాంక మధ్య మాటల యుద్ధం జరిగింది.
Read Also : ‘అఖండ’ విడుదల రోజునే సురేశ్ ప్రొడక్షన్స్ ద్వారా ‘మరక్కార్’!
సమాచారం ప్రకారం ఈ వారం కెప్టెన్ మానస్ మినహా అందరూ నామినేట్ అయ్యారు. రవి, శ్రీరామ చంద్ర, సన్నీ, కాజల్, ప్రియాంక, షణ్ముఖ్, సిరి 12వ వారం నామినేషన్స్ లో ఉన్నారు. రవి మినహా ఈ హౌస్‌మేట్స్ అందరూ గత వారం కూడా నామినేషన్‌లలో ఉన్నారు. మరి ఈ వీకెండ్ లో ఎవరెవరు హౌస్ నుంచి బయటకు వెళ్తారో చూడాలి. “బిగ్ బాస్ 5” నుంచి ఇప్పటి వరకూ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ లో సరయు, ఉమ, లహరి, నటరాజ్, హమీద, శ్వేత, ప్రియ, లోబో, విశ్వ, జస్వంత్, అనీ ఉన్నారు.