‘అఖండ’ విడుదల రోజునే సురేశ్ ప్రొడక్షన్స్ ద్వారా ‘మరక్కార్’!

నందమూరి నట సింహం బాలకృష్ణ తాజా చిత్రం ‘అఖండ’ డిసెంబర్ 2వ తేదీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. విశేషం ఏమంటే… అదే రోజున మోహన్ లాల్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘మరక్కార్’ కూడా జనం ముందుకు వస్తోంది. సీనియర్ దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఆంటోని పెరంబువూర్ నిర్మించారు.

Read Also : దుబాయ్ లో బన్నీ, ప్యారిస్ లో జూనియర్

‘మరక్కార్’ మూవీ తెలుగు హక్కులను ప్రముఖ పంపిణీ సంస్థ సురేశ్ ప్రొడక్షన్స్ దక్కించుకుంది. దాంతో ఈ సినిమా విడుదలను భారీగానే ప్లాన్ చేస్తున్నారు. తెలుగులో మోహన్ లాల్ కు చక్కటి గుర్తింపు ఉన్నా, ‘మన్యం పులి’ చిత్రంతో ఇక్కడ మంచి మార్కెట్ ఏర్పడింది. అలానే స్ట్రయిట్ తెలుగు సినిమాలు ‘జనతా గ్యారేజ్’, ‘మనమంతా’ సినిమాలు ఆయనను తెలుగు వారికి మరింత చేరువ చేశాయి. దాంతో ‘మరక్కార్’ సినిమా మీద భారీ ఆశలు నెలకొన్నాయి. ఈ సినిమాలో అర్జున్, సునీల్ శెట్టి, కిచ్చా సుదీప్, ప్రభు, మంజు వారియర్, కీర్తి సురేష్, కళ్యాణి ప్రియదర్శన్ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. రొన్నీ రాఫెల్ స్వరాలు సమకూర్చిన ఈ సినిమాలోని ‘కనులను కలిపినా’ అంటూ వచ్చిన మొదటి పాటకు విశేషమైన స్పందన లభించింది.

Related Articles

Latest Articles