Site icon NTV Telugu

Bigg Boss Telugu 9: మరికాసేపట్లో బిగ్ బాస్.. లోపలికి వెళ్లిన వారెవరంటే?

Bigg Boss 9

Bigg Boss 9

ఎట్టకేలకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు 9: రణరంగం ఈ రాత్రి గ్రాండ్ ప్రీమియర్‌తో అధికారికంగా ప్రారంభం కానుంది. వారాల తరబడి సోషల్ మీడియాలో కొనసాగిన ఊహాగానాలు, ఈ సీజన్‌లో హౌస్‌లోకి ఎవరు అడుగుపెడతారనే చర్చలకి నేటితో తెరపడనుంది. సోషల్ మీడియా బజ్ ప్రకారం, ఈ సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్ల జాబితా ఇదిగో:

భరణి శంకర్ – టీవీ నటుడు
చిలసౌ స్రవంతి, సీతామహాలక్ష్మి, కుంకుమ రేఖ వంటి సీరియల్స్‌లో తన నటనతో గుర్తింపు పొందిన టీవీ నటుడు భరణి శంకర్ ఈ సీజన్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. బాహుబలి, ఆవిరి చిత్రాల్లో కూడా నటించిన భరణి, సీరియల్స్‌ ప్రేక్షకులకు సన్నిహితుడు.

సుమన్ శెట్టి – నటుడు
జయం, 7/జి బృందావన్ కాలనీ చిత్రాల్లో తన కామెడీ టైమింగ్‌తో గుర్తింపు పొందిన సుమన్ శెట్టి, నంది అవార్డు విజేతగా ఒకప్పుడు ఇంటింటా సుపరిచితుడు. కానీ, క్రమంగా సినిమాల నుంచి దూరమైన సుమన్ కు బిగ్ బాస్ రెండో ఇన్నింగ్స్‌గా మారనుందని సోషల్ మీడియా బజ్ చెబుతోంది.

రాము రాథోడ్ – ఫోక్ స్టార్
“రాను ముంబై కి రాను”, “సొమ్మసిల్లి పోయినవే చిన్ని రాములమ్మ” వంటి పాటలతో కోట్లాది అభిమానులను సంపాదించిన ఫోక్ సింగర్ రాము రాథోడ్ ఈ సీజన్‌లో ఖచ్చితంగా ఉంటాడని టాక్.

రీతు చౌదరి – సీరియల్ నటి
జబర్దస్త్ నుంచి ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వరకూ తన గ్లామర్‌తో ఆకట్టుకున్న రీతు చౌదరి, ఇటీవల ఒక ఏపీ భూ కుంభకోణంలో పేరు వినిపించడంతో వార్తల్లో నిలిచింది.

తనూజా గౌడ – సీరియల్ నటి
ముద్ద మందారం, అందాల రాక్షసి సీరియల్స్‌తో టీవీ ప్రేక్షకులకు సుపరిచితమైన కన్నడ భామ తనూజా గౌడ ఈ సీజన్‌లో ఖచ్చితంగా ఉండనుంది.

జబర్దస్త్ ఇమ్మాన్యుయెల్ – నటుడు
జబర్దస్త్‌లో తన కామెడీ టైమింగ్‌తో అలరించిన ఇమ్మాన్యుయెల్, ఈటీవీని వీడి MAA టీవీలో ఇప్పుడు షోస్ చేస్తున్నాడు. అతని ఎంట్రీ దాదాపు ఖాయమని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

శ్రష్టి వర్మ – కొరియోగ్రాఫర్
జానీ మాస్టర్‌తో కొరియోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత యథా రాజా తథా ప్రజా చిత్రంలో నటిగా మారిన శ్రష్టి వర్మ, వివాదాలతో ఇప్పటికే హాట్ టాపిక్‌గా ఉంది. ఆమె హౌస్‌లో కంటెంట్ జనరేటర్‌గా మారే అవకాశం ఉంది.

ఆశా సైని – లక్స్ పాప
నువ్వు నాకు నచ్చావ్, నరసింహ నాయుడు (“లక్స్ పాపా” పాట) చిత్రాలతో 2000లలో గ్లామర్ క్వీన్‌గా పేరు తెచ్చుకున్న ఆశా సైని హౌస్‌లోకి అడుగుపెడుతున్నట్లు తెలుస్తోంది.

సంజనా గల్రానీ – నటి
బిగ్ బాస్ కన్నడలో ఇప్పటికే పాల్గొన్న సంజనా గల్రానీ, బుజ్జిగాడు చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు.

అగ్ని పరీక్ష వారియర్స్
అగ్ని పరీక్ష డిజిటల్ ప్రీ-షో ద్వారా ఎంపికైన కొందరు సామాన్యులు హౌస్‌లోకి అడుగుపెట్టనున్నారు.

శ్రీజ దమ్ము
మాస్క్‌మ్యాన్ హరీష్
ఆర్మీ పవన్
మర్యాద మనీష్
ప్రియ

వైల్డ్ కార్డ్ ఎంట్రీలు
బిగ్ బాస్ సీజన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు లేకుండా పూర్తి కాదు. దివ్వెల మాధురి (దువ్వాడ శ్రీనివాస్‌తో సంబంధంతో వార్తల్లో నిలిచిన వ్యక్తి), చిట్టి పికిల్స్‌గా పేరొందిన అలేఖ్య వంటి పేర్లు వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా చర్చలో ఉన్నాయి. అయితే వాటిని రాయల్ కార్డు ఎంట్రీలుగా పిలవనున్నారు. అగ్ని పరీక్ష వారియర్స్ నుంచి మరో ఇద్దరిని కూడా లోపలి పంపే అవకాశం ఉంది.

Exit mobile version