NTV Telugu Site icon

Gangavva : గంగవ్వకు గుండెపోటు.. ఆ ఫోటో షేర్ చేసిన టీమ్ మెంబర్?

Ganavva

Ganavva

బిగ్ బాస్ సీజన్ తెలుగు సీజన్ 8 సూపర్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇప్పటికే పలువురు కంటెస్టెంట్స్ బిగ్ బాస్ ఇంటి నుండి సొంత ఇంటికి వెళ్లిపోయారు. టాస్క్ లు, సరదా సంభాషనలు, గొడవలు, ఎత్తులకు పై ఎత్తులతో బిగ్ బాస్ సీజన్ 8 నడుస్తోంది. హోస్ట్ నాగార్జున అదరగొడుతున్నారు. కాగా ఇటీవల వైల్డ్ కార్డు ఎంట్రీగా గంగవ్వ, ముక్కు అవినాష్, రోహిణి, మెహబూబ్, హరితేజ, టేస్టీ తేజ తో పాటు మరికొందరు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Also Read : AS : ‘ఏషియన్ సినిమాస్’ లో వాటాకు బాలీవుడ్ సంస్థ ప్రయత్నాలు..?

వైల్డ్ కార్డ్ ఎంట్రీ మరింత మజాగా సాగుతున్న బిగ్ బాస్ సీజన్ 8 కు సంబంధించి ఓక పుకారు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన గంగవ్వకు బిగ్ బాస్ హౌస్ లో ఉండగా గుండెపోటు వచ్చిందని రకరకాల ప్రచారాలు మొదలయ్యాయి. దానికి తోడు ఆమె ఏదో దయ్యం పట్టినట్టు బిహేవ్ చేస్తున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ హౌస్ నిర్వాహకులు ఈ విషయం బయటకు రాకుండా మేనేజ్ చేస్తున్నారని రోజుకొక గాసిప్ తో వార్తలు బయటకు వస్తున్నాయి. అయితే ఈ విషయమై గంగవ్వకు మై విలేజ్ షో టీం మెంబెర్ అనిల్ గీల సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చాడు. గంగవ్వకు బిగ్ బాస్ హౌస్ లో ఉండగా గుండెపోటు వచ్చిందనే వార్తలు పూర్తిగా ఫేక్.  గంగవ్వ చాలా ఆరోగ్యంగా ఉన్నారు. దయచేసి ఫేక్ న్యూస్ ను స్ప్రెడ్ చేయకండి అంటూ ఫోటోను షేర్ చేసాడు అనిల్ గీల.

Show comments