NTV Telugu Site icon

Bigg Boss 8: లెమన్ పిజ్జా టాస్క్.. హౌస్‭లో ఆకలి కేకలు.. తినాలంటే గెలవాల్సిందే..

Bigg Boss 8 Promo

Bigg Boss 8 Promo

Bigg Boss 8 Day 10 Promo: బిగ్ బాస్ సీజన్ 8 మొదలై అప్పుడే 10 రోజులకు చేరుకుంది. ఈ సీజన్లో మొదటి వారంలో బేబక్క ఎలిమినేట్ ఆయన సంగతి తెలిసిందే. ఇకపోతే తాజాగా 10వ రోజుకు సంబంధించిన ప్రోమో ని బిగ్ బాస్ సోషల్ మీడియా వేదికగా నిర్వాహకులు షేర్ చేశారు. ఈ క్రమంలో ప్రోమో చూసినట్లయితే.. ఆడుతున్న హౌస్ మేట్స్ ఏమో కానీ.. చూస్తున్న ఆడియన్స్ మాత్రం కాస్త ఉత్కంఠత వచ్చిందని చెప్పవచ్చు. తొమ్మిదో రోజు నామినేషన్ లో భాగంగా రంగుపడుద్ది అంటూ నామినేషన్స్ రచ్చ రచ్చ సాగిన తర్వాత ” లెమన్ పిజ్జా ” అంటూ నేడు సరికొత్త టాస్క్ తో కంటెస్టెంట్స్ కు మరో పరీక్ష పెట్టాడు.

Bigg Boss 8 Telugu: ఫుడ్ కోసం ఏంట్రా బాబు అలా.. నామినేషన్స్‭తో హీటెక్కిన బిగ్ బాస్ హౌస్..

ఇక ప్రస్తుతం ఇంటి చీప్స్ గా ఉన్న నైనిక, నిఖిల్, యష్మి లకు వారానికి సరిపోయే ఇంటి సభ్యులకు కావాల్సిన రేషన్ గెలుచుకోవడానికి యాక్షన్ ఏరియాలో ఉంచిన బిగ్ బాస్ సూపర్ మార్కెట్ నుండి సరిపడా ఆహారాన్ని తీసుకురావడం వారికి బాధ్యతను అప్పగించాడు. బజర్ మోగగానే ఆ ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు వారానికి సరిపడా రేషన్ ను తీసుకోవచ్చే ప్రయత్నాన్ని చేశారు. ఇక ఆ తర్వాత లెమన్ పిజ్జా అంటూ ఆట మొదలుపెట్టాడు బిగ్ బాస్. ఈ గేమ్ లో ఏ క్లాన్ లో అయితే మూడు నిమ్మకాలను ముందుగా బయటకు తీసి ఎక్కువ రౌండ్స్ లో విజయం సాధిస్తారో.. వారు విజేతలుగా నిలిచి షాపింగ్ చేసిన వస్తువులను పొందుతారంటూ బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు.

Big Boss: కొత్త ఆట, కొత్త అధ్యాయం.. కొత్త హోస్ట్‌ కూడానా..?

దీంతో పృధ్వి శెట్టి – అభయ్, నాగ మణికంఠ – నిఖిల్, సీత – నబిల్ అఫ్రిది మూడు బ్యాచ్లుగా విడిపోయి గేమ్ ఆడటం మొదలుపెట్టారు. ప్రోమో చూస్తే ఈ గేమ్ చాలా ఆసక్తికరంగా జరిగినట్లుగా కనబడుతోంది. ప్రోమో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఈసారి పోస్ట్ నాగార్జున చెప్పిన విధంగానే లిమిట్లెస్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Show comments