Bigg Boss Telugu 7: కెప్టెన్సీ కోసం మరో చిచ్చుపెట్టిన బిగ్ బాస్.. బెస్ట్ పెర్ఫార్మన్స్ ఎవరిదంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్ నాలుగు వారాలు పూర్తయ్యాయి. దీంతో ఐదో వారంలో అనూహ్య మార్పులు తీసుకొచ్చారు బిగ్ బాస్.. ముందుగా చెప్పినట్లు ఉల్టా పుల్టా అనే విధంగా ఎన్నో మార్పులు తీసుకొచ్చారు.. ఊహకు అందని విధంగా కొత్త అనేక ట్విస్ట్ లు ఇస్తున్నారు.. నిన్నటి ఎపిసోడ్ లో పవర్ అస్త్రాలను వెనక్కి తీసుకున్నారు.. శివాజీ హ్యాపీగా ఫీల్ అవ్వగా.. శోభా అతనిపై మండిపడింది..
ఇకపోతే నిన్నటి ఎపిసోడ్‌లో హౌజ్‌లో ఉన్న పది మంది కంటెస్టెంట్‌లు జంటలుగా ఏర్పడాలని తెలిపారు బిగ్ బాస్. ఈ నెల రోజుల్లో హౌజ్‌లో ఒకరితో ఒకరికి బాండింగ్ ఏర్పడి ఉంటుందని, అలా తమ బెస్ట్ బడ్డీలను ఎంపిక చేసుకోవాలని, అందరు జంటలుగా ఏర్పడాలని తెలిపారు బిగ్‌బాస్. వాళ్లు బడ్డీలుగా ఏర్పడిన దాన్ని బట్టి మున్ముందు ఆట ఉంటుందని, అందుకే జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలన్నారు.. దాంతో హౌస్ లోని వాళ్లు జంటలు ఏర్పడ్డారు..శివాజీ-ప్రశాంత్, అమర్-సందీప్, ప్రియాంక-శోభా శెట్టి, గౌతమ్-శుభ శ్రీ, యావర్-తేజ లు జంటలగా ఏర్పడ్డారు..
Also Read
ఈ క్రమంలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కు స్మైల్` టాస్క్ ఇచ్చారు.. ఆ స్మైల్‌లో పళ్లు మిస్సింగ్ ఉంటాయి. వాటిని వెతికి తీసుకురావాల్సి ఉంటుంది. ఈ టాస్క్ ను మొదటగా శివాజీ, ప్రశాంత్ పళ్లు ఫిల్ చేసి బెల్ కొడతారు. ఆ తర్వాత గౌతమ్-శుభ శ్రీ, ఆ తర్వాత సందీప్-అమర్‌లు బెల్ కొడతారు. శోభా శెట్టి, ప్రియాంకలు, చివరగా యావర్ తేజలు నిలుస్తారు.. అయితే ఈ టాస్క్ ను ఎవరు పూర్తిగా చెయ్యలేక పోతారు..గౌతమ్-శుభశ్రీ, సందీప్- అమర్, శివాజీ-ప్రశాంత్, శోభాశెట్టి-ప్రియాంక, చివరగా యావర్-తేజలుగా నిర్ణయించారు. కానీ దీనిపై అటు అమర్, ఇటు ప్రియాంక అభ్యంతరం తెలిపారు.. దాంతో హౌస్ లో హీటెక్కుతుంది.. మరి కెప్టెన్సీ టాస్క్ లో ఎవరు నిలిచారో ఈరోజు ఎపిసోడ్ లో తెలుస్తుంది..
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్‌కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!