Bigg Boss Telugu 6: బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 గ్రాండ్ గా మొదలైపోయింది. నాగ్ ఎంట్రీ అదరగొట్టేశాడు. ఇక వరుసగా కంటెస్టెంట్లు ఎంట్రీ ఇస్తున్నారు. వారి స్టోరీస్, వారు బిగ్ బాస్ లో ఎలా ఉండాలో చెప్తూ మొదలుపెట్టారు.
ఇక 21 మంది కంటెస్టెంట్లతో బిగ్ బాస్ హౌస్ కళకళ లాడుతోంది. ఈ ఒక్కరాత్రి ఎంతో సంతోషంగా కంటెస్టెంట్స్ అందరూ గడుపుతుంటారు. రేపటి నుంచి ఫైట్ మొదలు కానుంది. మరి ఎవరి గేమ్ ఎలా ఉండబోతుంది అని చూడాలంటే కొన్ని గంటలు ఆగాల్సిందే..
21 వ కంటెస్టెంట్ గా సింగర్ రేవంత్ అడుగుపెట్టాడు. తన భార్యతో కలిసి స్టేజిపై సందడి చేశాడు. బాహుబలి చిత్రంలో మనోహరి సాంగ్ తో ఫేమస్ అయినా రేవంత్ ఇండియన్ ఐడల్ విన్నర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక భార్య ముందు నాగ్, రేవంత్ ను ఆట పట్టించాడు. ఈ స్టేజి మీద నాగ్ తో ఇలా ఉండడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు. రేవంత్ మంచి ప్లే బాయ్ అని నాగ్ అనడంతో తనకు పెళ్లి అయ్యిందని, ఇలాంటివి వింటే భార్య తిడుతుందని చెప్పుకొచ్చాడు. వారిద్దరి మధ్య కొద్దిసేపు తగాదా పెట్టిన నాగ్.. చివరికి రేవంత్ కు కొన్ని కార్డ్స్ ఇచ్చి లోపలి పంపాడు.
20 వ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చింది ఆరోహి రాయ్ అలియాస్ అంజలి. చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలను అనిభవించి ఇక్కడికి వచ్చానని చెప్పిన ఆమె తన తల్లి మృతిని తలుచుకొని బాధపడింది. సాయం చేయడానికి వచ్చినవారందరు నాకేంటి అని చేసినవారేనని, తల్లి మృతి చెందినా బెదరకుండా యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టానని, షార్ట్ ఫిల్మ్స్‌తో గుర్తింపు పొందినట్లు చెప్పుకొచ్చింది. ఇక ఇస్మార్ట్ న్యూస్‌తో పాపులారిటీ దక్కించుకున్న ఆమెను నాగ్ ఒక గేమ్ ఆడించి లోపలికి పంపాడు.
19 వ కంటెస్టెంట్ గా అడుగుపెట్టాడు మోడల్ రాజశేఖర్. ఎన్నో కష్టాలు పడి మోడలింగ్ వైపు వచ్చానని చెప్పిన రాజశేఖర్ పలు సీరియల్స్ తో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక నాగ్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తూ తన గతాన్ని నెమరు వేసుకున్నాడు. ఆఫీస్ బాయ్ గా పనిచేస్తూ మోడలింగ్ పై ఇంట్రెస్ట్ తో ఎంతో కష్టపడి ఈ స్టేజి మీదకు వచ్చినట్లు చెప్పాడు. ఇక నాగ్ అతనికి కార్డ్స్ ఇచ్చి లోపలి పంపించాడు.
18 వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు ఆది రెడ్డి. బిగ్ బాస్ రివ్యూలతో ఫేమస్ అయిన ఆది రెడ్డి కామన్ మ్యాన్ కేటగిరిలో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాడు. ఇక ఒక సాధారణమైన గ్రామంలో పుట్టిన తన గురించి, తన జీవితం గురించి నాగ్ కు వివరించాడు ఆది. ఒక ఫ్రెండ్ సలహాతో యూట్యూబ్ లో బిగ్ బాస్ రివ్యూ పెట్టినట్లు తెలిపిన ఆది ఆ వీడియో క్లిక్ అవ్వడంతో దానిమీదే ఫోకస్ పెట్టి ఇక్కడి వరకు వచ్చినట్లు చెప్పుకొచ్చాడు. ఇక అతనితో కూడా ఒక చిన్న గేమ్ ఆడిన నాగ్.. ఆదిని బిగ్ బాస్ హౌస్ లోకి పంపాడు.
17 వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది జబర్దస్త్ నటి ఫైమా. నాగ్ ను చూడగానే ఏడ్చేసిన ఆమె మూడేళ్ళ నుంచి కష్టపడుతున్నాను. ఈ ఏడాది సక్సెస్ అందుకున్నట్లు చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ కు నేను ఎందుకు వచ్చానంటే.. నేను ఎప్పటినుంచో ఈ స్టేజిను చూడాలనుకున్నాను. కానీ నువ్వు నల్లగా.. బక్కగా ఉంటావ్.. నిన్నెవరు చూస్తారు అని అన్నారు. ఇక ఈ స్టేజి పై నిలబడడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇక నా లైఫ్ లో స్పెషల్ పర్సన్ అంటే ప్రవీణ్.. అతని అమ్మ చిన్నప్పుడే చనిపోయింది, ఐదు రోజుల క్రితం వారి నాన్న చనిపోయాడు. కానీ ఇలాంటి సమయంలో నేను పక్కన లేనే అని బాధగా ఉంది అని చెప్పుకొచ్చింది. ఇక ప్రవీణ్ కోసమైనా ఈ టైటిల్ గెలవాలని కోరుకుంటున్నాను. మేము 35 ఏళ్ళ నుంచి అద్దె ఇంట్లో ఉంటున్నాం.. ఈ డబ్బుతో మా అమ్మకు ఇల్లు కట్టివ్వాలనుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది. ఇక ప్రవీణ్ లవ్ లెటర్ కామెడీని పంచింది.
16 వ కంటెస్టెంట్ గా పవన్ కళ్యాణ్ సాంగ్ తో ఎంట్రీ ఇచ్చాడు ఆర్జే సూర్య. మిమిక్రీ ఆర్టిస్టుగా హీరోలందరి వాయిస్ తో బిగ్ బాస్ లోకి అడుగుపెడుతున్నట్లు చెప్పుకొచ్చాడు. ప్రమోషన్స్ టైమ్ లో మీకోసం ఎదురుచూడడమే తప్ప ఇలా ఒకే స్టేజిపై ఉండడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. ఇక చిన్నతనంలో సూర్య మిమిక్రీ చేస్తుంటే అతని తల్లితండ్రులు హాస్పిటల్ కు తీసుకెళ్లిన సంఘటనను నాగార్జునకు చెప్పుకొచ్చాడు. ఇక స్టేజిపై హీరోల ఫొటోస్ చూపించి అతనితో మిమిక్రీ చేయించాడు నాగ్. ఇక అతనికి బ్లాక్ కార్డ్స్ ఇచ్చి లోపలి పంపాడు నాగార్జున
15 వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది ఇనయా సుల్తానా. వర్మ తో ఒక పార్టీలో డాన్స్ చేయడంతో ఆమె ఫేమస్ అయ్యింది. దాని గురించి నాగ్ మాట్లాడుతూ ఈ పబ్లిసిటీ వలన నీకు బ్యాడ్ నేమ్ వచ్చిందని అడుగగా ఏది వచ్చినా ఫేమస్ అయ్యాను అది చాలు అని చెప్పుకొచ్చింది. ఇక తన తండ్రి మరణ వార్త చెప్పి కొద్దిగా ఏడిపించిన ఇనయా.. తన తండ్రి పేరుతో గుర్తింపు పొంది బయటికి రావాలంటూ కోరుకొంది. ఇక నాగ్ కొన్ని ప్రశ్నలు అడుగగా.. వెస్ట్రన్ డ్రెస్ అంటే ఇష్టమని, ఫ్లర్ట్ చేయడమంటే ఇష్టమని నాగ్ ను హగ్ చేసుకొంది. ఇక తన మీద వచ్చిన నెగటివ్ కామెంట్స్ అన్నీ వదిలేసి ఇక్కడివరకు వచ్చానని చెప్పుకొచ్చింది.
14 వ కంటెస్టెంట్ గా అడుగుపెట్టాడు షానీ సాల్మోన్. సై సినిమాలో నితిన్ ఫ్రెండ్ గా కెరీర్ మొదలుపెట్టిన అతని స్టోరీ కంటతడి పెట్టించింది. సై ఆడిషన్స్ కు సెలెక్ట్ అయ్యావని రాజమౌళి చెప్పిన తెల్లారే తన మదర్ చనిపోయినట్లు చెప్పాడు. కబడ్డీ ప్లేయర్ గా నేషనల్స్ లో గోల్డ్ మెడల్ తెచ్చుకున్న షానీ మోకాలు ప్రమాదానికి గురి కావడంతో ఆటను ఆపేశానని చెప్పుకొచ్చాడు. ఇక షానీ అంటే చిన్నతనం నుంచి ఉన్న గర్ల్ ఫ్రెండ్స్ పెళ్లి తరువాత వదిలి వెళ్లిపోవడంతో వారి పేర్లలోని మొదటి అక్షరాలను కలుపుకొని షానీ అని పెట్టుకున్నట్లు చెప్పాడు. ఇక ఈ స్టేజి మీద రాజమౌళికి థాంక్స్ చెప్పిన అతను నాగ్ ఇచ్చిన టాస్క్ ను పూర్తి చేస్తానని చెప్పుకొచ్చాడు.
13 వ కంటెస్టెంట్ గా హీరోయిన్ వసంతి కృష్ణన్ అడుగుపెట్టింది. మాచర్ల నిఓయాజకవర్గం చిత్రంలోని రారా రెడ్డి సాంగ్ తో ఎంట్రీ ఇచ్చిన చిన్నది నాగ్ ను చూసి ఎంతో మురిసిపోయింది. మన బిగ్ బాస్ లోకి అల్లరి చేయడానికి వాసంతి వచ్చిందని నాగ్ ఆటపట్టించాడు. ఇక ప్రేమను, కోపాన్ని ఎలా చూపిస్తావో చెప్పమని అడిగిన నాగ్.. లైఫ్ లో ఎలాంటి భాగస్వామి కావాలని అడుగగా.. నా డ్రీమ్ బాయ్ లో మొదటిగా ఉండాల్సింది లాయాలిటీ ఉండాలని చెప్పింది. ఇక వసంతి కి ట్యూషన్ కార్డ్స్ ఇచ్చిన నాగ్ పంచ్, కిస్, హాగ్ బ్యాడ్జెస్ ఇచ్చి ఇంట్లో ఆమెకు ఎవరికైతే నచ్చితారో వారికి పంచ్, ముద్దు, హగ్ ఇవ్వాలని కోరాడు.
12 వ కంటెస్టెంట్ గా అడుగుపెట్టాడు నటుడు బాలాదిత్య. బాలనటుడిగా మొదలుపెట్టిన బాలాదిత్య కెరీర్ ఎన్నో మలుపులు తిరిగిందని స్టోరీలో తెలిపాడు. నటుడిగా, రైటర్ గా, ఒక కంపెనీకి మేనేజర్ గా ఎన్నో స్థానాలను అధిరోహించానని చెప్పిన బాలాదిత్య ఇప్పుడు బిగ్ బాస్ కు గురిపెట్టినట్లు చెప్పుకొచ్చాడు. చాలా ఏళ్ళ తరువాత నాగ్ ను చూడడం చాలా సంతోషంగా ఉందని బాలాదిత్య చెప్పుకొచ్చాడు. అన్న సినిమాకు వచ్చిన నంది అవార్డు అందుకోవడమే నాకు కెరీర్ లో బెస్ట్ అనిపించింది అని చెప్పుకొచ్చాడు. ఇక నాగ్ సినిమాలు హలో బ్రదర్, వారసుడు సినిమాల్లో నటించానని చెప్పుకొచ్చిన బాలాదిత్య నాగేశ్వరరావు గారితో నటించడం అదృష్టమని తెలిపాడు. ఇక వెళ్లే ముందు తన చిన్న కూతురు ఫోటోను అందించాడు నాగ్..
పది, పదకొండు కంటెస్టెంట్స్ గా రియల్ కపుల్ రోహిత్- మెరీనా అడుగుపెట్టారు. రాధేశ్యామ్ చిత్రంలోని నిన్నేలే.. నిన్నేలే ప్రేమ సాంగ్ తో అద్భుతంగా ఎంట్రీ ఇచ్చారు. ఈ జంట ఒక సీరియల్ లో కలిసి నటించి ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. నాగ్ వారిని ఆప్యాయంగా ఆహ్వానించాడు. రోహిత్ పంజాబ్.. మెరీనా గోవా.. ప్రస్తుతం హైదరాబాదీలుగా మారారని చెప్పుకొచ్చారు. ఒక మూవీలో కలిసి చేసాం.. సినిమా అయితే రిలీజ్ అవ్వలేదు కానీ మా లవ్ స్టోరీ ఓపెన్ అయ్యిందని జంట చెప్పుకొచ్చారు. ఇక బిగ్ బాస్ లోకి తాము ఛాలెంజ్ అంటే ఇష్టపడతానని, మేము ఇద్దరం అందరితో కలిసి పోవాలని వచ్చాం. రోహిత్ కు తానే మొదటగా ప్రపోజ్ చేసినట్లు మెరీనా చెప్పుకొచ్చింది. ఇక వీరిద్దరి రిలేషన్ పై నాగ్ ఒక క్విజ్ పెట్టారు. బెటర్ కిస్సర్ గా మెరీనా మార్కులు కొట్టేసింది.. ఇక ఇద్దరిలో మెరినానే ఎక్కువ మార్కులు పొందింది. ఇద్దరు సింక్ లోనే ఉన్నారని నాగ్ చెప్పుకొచ్చాడు.
తొమ్మిదో కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది హాట్ బ్యూటీ అభినయ శ్రీ. తనకు పేరు తెచ్చిన అ.. అంటే అమలాపురం సాంగ్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ నాగ్ తో తాన్ ముచ్చట్లు చెప్పుకొచ్చింది. ఆర్య సినిమాలో అ.. అంటే అమలాపురం సినిమా తరువాత 100 సాంగ్స్ చేసినా కొద్దిగా గ్యాప్ వచ్చిందని చెప్పుకొచ్చింది. ఇక ఈ స్టేజి నాకు బంగారం లాంటి అవకాశం లభించిందని చెప్పుకొచ్చింది. ఇక హౌస్ లో ఎంటర్ టైన్మెంట్ ఇవ్వడానికి వెళ్తున్నా అన్న అభినయ శ్రీ ఈ అవకాశాన్ని బాగా వాడుకోవాలనుకుంటున్నా అని చెప్పుకొచ్చింది. ఇక స్టేజ్ పై నాగ్ అభినయ ను భయపెట్టాడు. బల్లిని ఒంటి మీద వేసి తన భయాన్ని పోగొట్టాడు. అభినయ శ్రీ బయటగోచ్చేసరికి తనలో వేరే అభినయను చూస్తారని చెప్పుకొచ్చింది.
కోవూరు గ్రీష్మ గీతికా లేక రాయలు అంటూ అదరగొట్టేసింది గీతూ రాయల్.. ఇటీవలే జబర్దస్త్ లో గీతూ ప్రేక్షకులను నవ్వించి మెప్పించింది. ఇక గీతూ రాయల్ తన స్టోరీని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె లైఫ్ అద్భుతంగా ఉందని చెప్పుకొచ్చింది. చిత్తూరు చిరుత.. లేటెస్ట్ ఫైర్ బ్రాండ్ గా ఫేమస్ అయ్యాయని చెప్పుకొచ్చింది. ఇక నాగ్ తో కామెడీ చేసి చిత్తూరు యాసలో పిచ్చెక్కించింది. ఎనిమిదో కంటెస్టెంట్ గా మే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది.