అంబటి అర్జున్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. బుల్లి తెర పై పలు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. అదే గుర్తింపుతో టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొన్నాడు.. వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఇతను ఫైనల్ వరకు వెళ్లారు.. ఇటీవలే తన భార్య ప్రసవించింది.. సురేఖ జనవరి 9న పండంటి ఆడ బిడ్డకి జన్మనిచ్చింది.. ఈ విషయాన్ని స్వయంగా అర్జున్ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.. తాజాగా అర్జున్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
అర్జున్ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. తన పెళ్లి రోజును గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా తన భార్యకు విషెస్ తెలిపారు. పొరపాటున ఒక్కరోజు ఒక చుక్క చూపించా.. కానీ నాకు మాత్రం జీవితాంతం చుక్కలు చూపిస్తున్నావ్.. మనకు ప్రత్యేకమైన రోజున శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేశారు. బుధవారం అర్జున్- సురేఖ వివాహా వార్షికోత్సవం సందర్భంగా ఇలా తన భార్యపై ప్రేమను చాటుకున్నారు..
తనకు భార్య మీద ఎంత ప్రేమ ఉందో ఈ పోస్ట్ ద్వారా తెలిపాడు.. ఈ పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది.. ఇక కేరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం బుల్లితెరపై షోలు, సీరియల్స్‌తో పాటు సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. త్వరలోనే ఓ సినిమాలో హీరోగా నటించబోతున్నట్లు తెలుస్తోంది.. ఈ సినిమా పై త్వరలోనే ఒక ప్రకటన రానుందని సమాచారం..