తెలుగు బిగ్ బాస్ 7 రసవత్తరంగా సాగుతుంది.. రెండో వారం పవర్ అస్త్ర కోసం హౌస్ మేట్స్ మధ్య బిగ్ బాస్ చిచ్చు పెట్టింది..రెండవ పవర్ అస్త్ర పోటీకి అర్హులుగా ఎక్కువ అస్త్రాలు భాగాలూ సాధించి శివాజీ, షకీలా నిలిచారు. అయితే షకీలా అర్హత విషయంలో రతిక మరోసారి హౌస్ లో నానా రచ్చ చేసింది.స్ షకీలా కంటే ప్రిన్స్ యావర్ జెన్యూన్ గా అర్హుడు అని.. దీని గురించి మాట్లాడితే తనని కార్నర్ చేస్తున్నారు అంటూ రతిక గొడవ పడింది. తనకి అవకాశం దక్కక యావర్ ఎమోషనల్ అయ్యాడు. కంటతడి పెట్టుకున్నాడు.. ఇక హౌస్ లో తాను ఉండనని గేట్లు తెరిస్తే వెళ్ళిపోతానని యావర్ ఎమోషనల్ అయ్యాడు..
ఇకపోతే గౌతమ్ కృష్ణ, యావర్ మధ్య పెద్ద గొడవే జరిగింది. షకీలా అర్హురాలు అంటూ గౌతమ్ వాదించాడు. ఆ తర్వాత రతిక వంటగదిలో శుభశ్రీతో గొడవ పడింది. దీనితో శుభశ్రీ ప్రతి చోటా కెమెరాలో హైలైట్ కావడానికి ట్రై చేయొద్దు అంటూ చురకలంటించింది.శుభశ్రీకి షకీలా కూడా మద్దతు తెలిపింది. ఇక రెండవ పవర్ అస్త్ర పోటీలో ఆల్రెడీ శివాజీ, షకీలా అర్హత సాధించారు. మూడవ పోటీదారుడిని నేరుగా ఎంచుకునే అవకాశాన్ని బిగ్ బాస్ సందీప్ కి ఇచ్చారు. దీనితో సందీప్.. అమర్ పేరు చెప్పారు. ఆ విధంగా అమర్ పవర్ అస్త్ర పోటీలో నిలిచాడు.. ఇప్పుడు ముగ్గురు పవర్ అస్త్ర కోసం పోటీలో నిలవనున్నారు..
హౌస్ లో ఈ ముగ్గురుకి బిగ్ బాస్ పవర్ అస్త్ర పోటీలో ఆసక్తికర టాస్క్ ఇచ్చారు. ఒక పెద్ద చెవి బొమ్మని గార్డెన్ ఏరియాలో ఉంచి.. ఆ చెవిలో ఎంత గట్టిగా వీలైతే అంత గట్టిగా బిగ్ బాస్ అని అరవాలి. ఎవరిది పెద్ద గొంతో తేల్చుకోవాలి అని తెలిపాడు. దీనితో శివాజీ, షకీలా, అమర్ ముగ్గురూ ఒకరితర్వాత ఒకరు పలుమార్లు గట్టిగా బిగ్ బాస్ అని అరిచారు.. ఈ పవర్ అస్త్ర టాస్క్ లో ఈ ముగ్గురిలో ఎవరు గెలుచుకున్నారో ఈ వారం ఎండింగ్ లో నాగ్ ప్రకటిస్తాడు.. రేపటి ఎపిసోడ్ మరింత రసవత్తరంగా సాగుతుంది అస్సలు మిస్ అవ్వకండి…