NTV Telugu Site icon

Bigg Boss 7 Telugu: ప్రియాంక లెక్కలు చూసి షాకైన నాని.. యావర్ కు తెలుగు క్లాస్.. ఎపిసోడ్ మాములుగాలేదు..

Bb Nani

Bb Nani

బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు షో ప్రస్తుతం 13 వ వారంలో ఉంది.. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అని టెన్షన్ ఉన్నా.. వీకెండ్ సండే ఎపిసోడ్ ఫన్ మాములుగా ఉండదు… ప్రతి వారం ఏదొక సెలెబ్రేటి వచ్చినట్లే ఈ వారం కూడా వచ్చారు.. హాయ్ నాన్న ప్రమోషన్ లో భాగంగా ఆ సినిమా హీరో న్యాచురల్ స్టార్ నాని షోకు వచ్చారు.. ఈరోజు ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం హాయ్ నాన్న ప్రమోషన్లలో బిజీగా ఉన్న నాని.. ఈరోజు బిగ్‏బాస్ స్టేజ్ పైకి వచ్చేశాడు. బిగ్‏బాస్ సెకండ్ సీజన్ హోస్ట్ చేసిన నాని.. ఆ తర్వాత నాగార్జున హోస్టింగ్ చేస్తున్నారు.

ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో.. ముందుగా నాని మోడల్స్ తో చిందులు వేస్తూ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత నాగార్జున వస్తూ.. నాన్నా.. ఏంటీ ఇక్కడా.. ఇది సీజన్ 7.. సీజన్ 2 కాదు అంటూ పంచ్ వేశారు. నాగ్ ను నాని హగ్ చేసుకున్నాడు.. ఆ తర్వాత హాయ్ నాన్న విశేషాలను పంచుకున్నారు.ఇక తర్వాత హౌస్మేట్స్ ను పరిచయం చేశాడు నాగ్. ముందుగా అర్జున్ అంబటి.. కానీ అసలు పేరు అంబటి నాగార్జున అని పరిచయం చేయడంతో.. మీరు ఈ సీజన్ గెలిస్తే హోస్ట్ నాగార్జున .. విన్నర్ నాగార్జున అని అన్నాడు నాని.. రావాలని కోరుకుంటున్న అని అన్నారు..

అందరితో నాని ముచ్చటించారు.. ఆ క్రమంలో ప్రియాంక గురించి చెబుతూ.. తన గురించి ఒకటి చెప్పాలి. మ్యాథ్స్ టేబుల్స్ వచ్చా ?… నాగ్ అడగ్గా.. కొంచం కొంచం వచ్చు అని అన్నాడు నాని. దీంతో 4*8 ఎంత అని అడిగితే 32 అంటూ అనుమానంగానే చెప్పిన కరెక్ట్ చెప్పాడు. కానీ ప్రియాంక ఎంతో చెబుతుందో తెలుసా అంటూ వీడియోను చూపించారు. అందులో సంచాలక్ గా ఉన్న ప్రియాంక, శోభా ఇద్దరు అమర్ రింగ్స్ కౌంట్ చేస్తూ.. 4*8 .. 48 అంటూ ఠక్కున చెప్పేసింది. ఈ వీడియో చూడగానే నానితోపాటు హౌస్మేట్స్ షాకయ్యారు.. యావర్ కు తెలుగు క్లాస్ చెప్పడం షో కు హైలెట్ అయ్యింది.. ఇక ఎపిసోడ్ ఎలా ఉంటుందో తెలియాలంటే ఎపిసోడ్ మొత్తం చూడాల్సిందే..