బిగ్ బాస్ 7 ఎనిమిదో వారం పూర్తయ్యింది.. గతవారం వరకు అందరు అమ్మాయిలే ఎలిమినేట్ అయిన విషయం తేలిసిందే.. ఈ వారం కాస్త చేంజ్ చేశారు బిగ్ బాస్..అతి తక్కువ ఓటింగ్ వచ్చిన శోభాను కాదని సందీప్ మాస్టర్ ను ఎలిమినేట్ చేసినట్లుగా తెలుస్తోంది. శనివారం ఒక్కొక్కరికి గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. సండే ఫన్ డే వచ్చేసింది. ఈరోజు హౌస్మేట్స్ తో ఫన్నీ గేమ్స్ ఆడించేందుకు సిద్ధమయ్యారు నాగ్. తాజాగా విడుదలైన ప్రోమోలో ఒక్కొక్కరికి పడవ గేమ్ ఇచ్చి మళ్లీ స్నేహితుల మధ్య ఫిట్టింగ్ పెట్టే పనిలో పడ్డారు. సరదాగా ఓ చిన్న ఆట ఆడదాం. నేను ఇద్దరి పేర్లు చెబుతాను.. ఆ ఇద్దరిని పడవలో పెట్టాలి అని చెప్పారు..
ముందుగా ఈ గేమ్ లో గౌతమ్ ఆడారు..అర్జున్, ప్రియాంక ఫోటోలను బోటుపై పెట్టమన్నారు. నీ బోట్ మునిగిపోయే పరిస్థితి వస్తే ఎవరిని నీటిలోకి తోసేస్తావు.. ఎవర్ని బోట్లో ఉంచుతావు అని నాగ్ అడగ్గా.. అర్జున్ ను నీటిలో తోశాడు.. ప్రియాంకను సేఫ్ చేశాడు.. అలాగే ఒక్కొక్కరిని అడిగాడు నాగ్..అర్జున్ వచ్చేసి అమర్ ను నీటిలోకి తోసేస్తాను.. ఎందుకంటే ఇకనుంచైన ఎవరి హెల్ప్ లేకుండా ఏదైనా తనంతట తానే చేసుకోవాలని కోరుకుంటున్నాను అన్నారు. ఇక ఆ తర్వాత అమర్ వచ్చేసి.. ప్రియాంక, శోభా ఫోటోలను పెట్టి.. నేను మునిగిపోయేలా ఉన్నాను సార్ అని అన్నాడు. దీంతో హౌస్మేట్స్ అంతా నవ్వేస్తారు.
ఇక యావర్ ను శివాజీ, రతిక ఫోటోలు పెట్టి ఏదో ఆలోచిస్తుండగా.. Naag ఏం ఆలోచిస్తున్నావని అర్జున్ అనగానే.. షో తర్వాత జరిగేది అంటూ ఫన్నీ ఆన్సర్ ఇచ్చాడు… అలాగే తేజ యావర్, శోభాల ఫోటోలను బోట్ పై పెట్టి.. ఈ ముగ్గురిపై నీ పర్సనల్ ఒపీనియన్ చెప్పు అనడంతో శోభా ఫోటోను తీసేస్తాడు. దీంతో నీకు ఉందిలే అంటూ సెటైర్ వేశాడు నాగ్. భోలే నామినేషన్లలో ఉన్న ప్రశాంత్ ను బయటకు తీసుకురా అని చెప్పడంతో.. ఏ పేరు లేకుండా ఒక రైతు బిడ్డగా వచ్చి మంచి బీజం ఏర్పర్చుకున్నాడు.. ఇకపోతే ఈరోజు సందీప్ మాస్టర్ ఎలిమినేట్ అవ్వనున్నాడు.. అలాగే శోభా కూడా ఎలిమినేట్ అవుతుందనే వార్తలు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తుంది.. ఏం జరుగుతుందో చూడాలి..