NTV Telugu Site icon

Akkineni Nagarjuna: బిగ్ బాస్ సీజన్ 7.. నాగ్ రెమ్యూనిరేషన్ తో ఒక సినిమా తీయొచ్చు..?

Nag

Nag

Akkineni Nagarjuna: అక్కినేని కుటుంబం గురించి అక్కినేని హీరోల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిత్ర పరిశ్రమ రోజుకో కొత్త రంగు పులుముకుంటున్న వేళ అక్కినేని హీరోలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంటున్నారన్నది అభిమానుల మాట. కుర్ర హీరోలు అందరూ పాన్ ఇండియా అంటుండగా అక్కినేని హీరోలు మాత్రం ఇంకా నిదానంగా ఒక్కో సినిమాను తెరపైకి తెస్తున్నారు. నాగార్జున అయితే ఈ ఏడాది అసలు సినిమా తీస్తాడా లేదా అని సందిగ్ధంలో ఉండగా నా సామీ రంగా అంటూ ఒక సినిమాను ప్రకటించాడు. దీంతో నిరాశలో ఉన్న అక్కినేని ఫ్యాన్స్ హుషారు తెచ్చుకున్నారు. ఇక నాగ్ సినిమాల కంటే.. బిగ్ బాస్ ద్వారానే ఎక్కువ సంపాదిస్తున్నాడని ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది.

Siddharth: సిద్దార్థ్ ప్రెస్ మీట్ ను అడ్డుకున్న నిరసన కారులు.. నవ్వుతూ వెళ్ళిపోయిన హీరో

బిగ్ బాస్ రియాల్టీ షో మొదలైన థర్డ్ సీజన్ నుంచి నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. అప్పటినుంచి నాగ్ రెమ్యూనిరేషన్ ఎప్పటికప్పుడు బిగ్ బాస్ పెంచుతూనే ఉన్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. మూడో సీజన్ కోసం రూ. 5-8 కోట్లు అందుకున్నాడు. ఆ తరువాత ఒక్కో సీజన్ కోసం నాగ్ రెమ్యూనిరేషన్ పెంచుకుంటూ వెళ్తున్నాడు. బిగ్ బాస్ మూడో సీజన్ కోసం కేవలం ఎనిమిది కోట్లు అందుకున్న నాగ్ .. 7 వ సీజన్ వచ్చేసరికి దాదాపు రూ. 20 కోట్ల వరకు తీసుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి. బిగ్ బాస్ లో ఈ రేంజ్ లో రెమ్యూనిరేషన్ రావడంతోనే నాగ్ సినిమాలను కూడా తగ్గించాడని అంటున్నారు. ఇక రూ. 20 కోట్లు పెట్టి ఒక చిన్న సినిమా కూడా తీయొచ్చు అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

Show comments