బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు ఇప్పుడు ఆసక్తి గా మారింది.. కొత్త కొత్త టాస్క్ లతో జనాలను మెప్పించే పనిలో ఉన్నారు బిగ్ బాస్..రకరకాల గేమ్స్, హీటెక్కించే నామినేషన్స్ తో సందడిగా ఉంది. ఇక ఈ వారం నామినేషన్స్ లో ఏడుగురు ఉన్నారు. నయని పావని, అశ్విని, యావర్, శోభా శెట్టి, అమర్ దీప్, పూజా మూర్తి, తేజ నామినేషన్స్ లో ఉన్నారు.. ఇక బిగ్ బాస్ హౌస్ లోని వాళ్లను రెండు టీమ్ లు గా చేశారు.. వారికి పోటా పోటీగా బిగ్ బాస్ కొత్త కొత్త టాస్క్ లను ఇస్తున్నారు.. అయితే వారం ఎండింగ్ లో మాత్రం ఒకరు బయటకు వెళ్ళాలి..
ఇదిలా ఉండగా ఇప్పుడు కొత్తగావచ్చిన వారిని పోటుగాళ్లుగా.. పాత హౌస్ మేట్స్ ను ఆటగాళ్లు టీమ్ గా డివైడ్ చేశారు. ఈ రెండు టీమ్స్ కు గేమ్స్ పెట్టి హౌస్ లో సందడి చేస్తున్నారు బిగ్ బాస్. ఇప్పటికే కొన్ని ఫన్నీ టాస్క్ లతో పాటు మైండ్ గేమ్స్ కూడా అడిస్తున్నాడు బిగ్ బాస్. తాజాగా లేటెస్ట్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో నేటి ఎసిసోడ్ ఎలా ఉండబోతుందో చూపించారు.. ప్రోమో జనాలను విపరీతంగా ఆకట్టుకుంటుంది..
హౌస్ లో ఉన్న వారు ఎవరు స్మార్ట్ అని తెలుసుకోవడానికి ఓ గేమ్ పెట్టాడు బిగ్ బాస్. డైలాగ్స్, సాంగ్స్ ఆధారంగా బిగ్ బాస్ అడిగే ప్రశ్నలకు సమాధానాలుగా కొన్ని ఫోటోలు ఇచ్చి వాటిలో సరైనది దాన్ని ముందుగా తీసి బోర్డు పై ఉంచాలని చెప్పాడు. బిగ్ బాస్ ఈ గేమ్ చాలా సరదాగా సాగింది.. అమర్, తేజ ల రొమాన్స్ కాస్త ఫన్నీగా ఉండటంతో హౌస్ లో కాసేపు నవ్వులు పూసాయి.. గౌతమ్ అమర్ ను కొట్టగానే వెళ్లి తేజ పై పడ్డాడు. దాంతో మరోసారి చేయాలి అని బిగ్ బాస్ అనడంతో వద్దయ్యా అంటూ తేజ నవ్వులు పూయించాడు. మొత్తానికి నేటి ఎపిసోడ్ చాలా ఫన్నీగా ఉంది.. మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ ప్రేక్షకులను నవ్వించేలా ఉందని తెలుస్తుంది.. సో ఈరోజు ఎపిసోడ్ ను అస్సలు మిస్ అవ్వకండి…