బిగ్ బాస్ 7 సీజన్ లో బిగ్ బాస్ ఇస్తున్న ట్విస్ట్ లు మాములుగా లేవు.. అర్థం కాకుండా కన్ఫ్యుజన్ చేస్తున్నాడు.. నిన్న నయని పావని ఎలిమినేట్ అయ్యిన విషయం తెలిసిందే.. ఇప్పుడు తాజాగా హౌస్ లోని పెద్ద మనిషి శివాజీని బయటకు పంపించేశారు.. హీరో శివాజీ హౌస్ లోకి వెళ్లిన దగ్గర నుంచి పెద్దమనిషి తరహాలో ప్రవర్తిస్తున్నారు..మొదటి ఎపిసోడ్ నుంచి స్ట్రాంగ్ హౌస్ మెట్ గా గేమ్ ఆడుతూ దూసుకుపోతున్నారు. శివాజీ తన స్ట్రాటజీ గేమ్ ఆడుతూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. శివాజీ టాప్5లో ఖచ్చితంగా ఉంటాడని అంటున్నారు ప్రేక్షకులు. ఇక ఈ సీజన్ ఉల్టా పుల్టా గా ఉంటుందని ముందునుంచి చెప్తూ వస్తున్నారు..
నిన్నటి ఎపిసోడ్ లో చివరగా చెప్పినట్లే ట్విస్ట్ ఇచ్చారు బిగ్ బాస్..అందరు శోభా శెట్టి ఎలిమినేట్ అవుతుందని అనుకున్నారు. కానీ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన నయని పావని ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. దాంతో ఆమె బోరున ఏడ్చింది. అయితే నయని పావని హౌస్ లో ఉన్నవారితో బాగా కనెక్ట్ అయ్యింది. ముఖ్యంగా శివాజితో తనకు మంచి స్నేహం ఏర్పడిందని చెప్పింది.. ఇక తనను తండ్రిలాగ ఫీల్ అయ్యిందని చెప్పి ఎమోషనల్ అయ్యింది.. ఏదైనా ఛాన్స్ ఉంటే నేను వెళ్ళిపోతాను నయని పావనిని హౌస్ లోకి తిరిగి పంపించండి అని కూడా శివాజీ రిక్వెస్ట్ చేశాడు. టాస్క్ లో భాగంగా అతడి చేతికి గాయం అయిన విషయం తెలిసిందే..
బిగ్ బాస్ రూల్స్ ప్రకారం గాయం తగ్గేవరకు హౌస్ లో ఉండటానికి వీలు లేదు.. అయితే నేటి ఎపిసోడ్ లో శివాజీని హౌస్ నుంచి పంపించేశారని తెలుస్తోంది. నిన్నటి ఎపిసోడ్ చివరిలో శివాజీ హెల్త్ కారణంగా ఆయనను బయటకు పంపించేశారు బిగ్ బాస్. శివాజీ హౌస్ నుంచి వెళ్లిపోతున్నా అని చెప్పడంతో హౌస్ లో ఉన్నవారు వద్దు అన్న అంటూ ఆయనను ఆపే ప్రయత్నం చేశారు. అయితే శివాజీని తిరిగి హౌస్ లోకి తీసుకువచ్చారని తెలుస్తోంది. ప్రేక్షకుల్లో ఆసక్తి క్రియేట్ చేయడానికే ఇలా చేశారని తెలుస్తోంది.. అసలు ఎందుకు తీసుకెళ్లారు.. మళ్లీ ఎందుకు తీసుకొచ్చారో తెలియాలంటే ఈరోజు బిగ్ బాస్ ను చూడాల్సిందే..