మహా శివరాత్రి.. దేశంలోనే అతిపెద్ద పండుగ. శివరాత్రి సందర్భంగా భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉంటారు. మహా శివరాత్రి రోజు ఉపవాసం ఉండి రాత్రంతా జాగారం చేస్తారు. రాత్రంతా నిద్రపోకుండా శివనామ స్మరణతో గడుపుతారు. మొత్తం నాలుగు దశల్లో శివ పూజ చేస్తారు. ఇంట్లోనే శివలింగం ప్రతిష్టించి అభిషేకం చేసుకొని పూజ జరిపించుకోవచ్చు. లేదంటే శివాలయానికి వెళ్లి అభిషేకం చేయించుకోవచ్చు. రుద్రాభిషేకంలోనూ పాల్గొనవచ్చు. అసలు మహాశివరాత్రి అంటే ఏమిటి? ఎందుకు జరుపుకుంటారు? విశిష్టత ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం..
READ MORE: Assam: అస్సాంకు రూ. లక్ష కోట్ల పెట్టుబడులు.. అంబానీ, అదానీ పోటీపడి మరీ ఇన్వెస్ట్‌మెంట్..
ఈ పవిత్రమైన రోజునే శివుడు లింగ రూపంలో దర్శనమిచ్చాడని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం కూడా ఇదే రోజున జరిగిందని పురాణాల్లో పేర్కొనబడింది. హిందూ పురాణాల ప్రకారం.. మహాశివరాత్రి సందర్భంగా శివపార్వతుల కళ్యాణం జరిగినట్టుగా నమ్ముతారు. అలాగే ఇదే రోజున లింగోద్భవం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. పరమశివుడు పురుషుడిని సూచిస్తే, పార్వతీ దేవి ప్రకృతిని సూచిస్తుంది. సృష్టికి మూలమైన శక్తి చైతన్యాల కలయికను మహాశివరాత్రి పర్వదినంగా సూచిస్తుంది..
READ MORE: Shivaraj Yogi : కోటి రుద్రాక్ష ప్రసాదం.. మహదేవ్ శక్తి సంస్థాన్
పురాణాల ప్రకారం ఓ రోజు ఈశ్వరుని భార్య పార్వతీదేవి శివరాత్రి గురించి శివుడిని అడగగా.. తనకు శివరాత్రి ఉత్సవాలంటే ఎంతో ఇష్టమనీ.. ఆ ఒక్క రోజు తనకు ఉపవాసంతో ఉండి, జాగరణ(నిద్రపోకుండా) ఉంటే చాలని చెబుతాడు. అదే విధంగా ఈరోజున పగలంతా ఎంతో నియమ నిష్ఠలతో ఉపవాసం ఉండి, రాత్రి సమయంలో శివలింగాన్ని పాలతో, పెరుగుతో, నెయ్యితో, తేనేతో అభిషేకం చేస్తే వారికి తన అనుగ్రహం తప్పక లభిస్తుందని చెబుతాడు.