NTV Telugu Site icon

Mahashivratri 2025: శివుడికి అభిషేకం ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే మంచిది?

Mahashivratri

Mahashivratri

శివుడు బ్రహ్మ రూపం నుంచి లింగ రూపంలోకి అవతరించిన రోజుని మహాశివరాత్రి జరుపుకుంటారు. శివపురాణం ప్రకారం శివుడు, పార్వతి దేవి వివాహం జరిగింది కూడా మహాశివరాత్రి రోజున అని చెప్తారు. రేపే (ఫిబ్రవరి 26)న మహాశివరాత్రి పండుగ ఘనంగా జరుపుకోనున్నారు. ప్రత్యేక ఆరాధన, శివార్చన, శివాభిషేకంతో శివాలయాలు భక్తులతో కిటకిటలాడిపోతాయి. శివుడికి అభిషేకం చేసే ఒక్కో ద్రవ్యానికి ఒక్కో విశిష్టత ఉంటుంది. కాగా.. శివుడికి ఏ పదార్థాలతో అభిషేకం చేస్తే ఎలాంటి ప్రయోజనాలుంటాయో ఇప్పుడు చూద్దాం…

READ MORE: Dwarapudi: ద్వారపూడిలో 60 అడుగుల ఆదియోగి విగ్రహం.. రేపే ప్రారంభం

ఏ పదార్థాలతో చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది?

  1. అన్నాభిషేకం- సుఖ జీవనం
  2. ద్రాక్ష రసం—సకల కార్యాభివృద్ధి
  3. నారికేళ జలం- సర్వ సంపద వృద్ధి చెందుతుంది
  4. ఖర్జూర రసం- శత్రునాశనం
  5. దూర్వోదకం( గరిక జలం)- ఆర్థికాభివృద్ధి
  6. ఆవుపాలు- సర్వ సుఖాలు కలుగుతాయని నమ్మకం. దీర్ఘాయువు ఇస్తుంది.
  7. ఆవు పెరుగు- ఆరోగ్యం, బలం సమకూరతాయి. సంతాన ప్రాప్తి లభిస్తుంది.
  8. ఆవు నెయ్యి- ఐశ్వర్యం పెరుగుతుంది
  9. చెరకు రసం- దుఖం తొలగిపోతుంది
  10. తేనె- తేజస్సు పెరుగుతుంది
  11. భస్మ జాలం- పాపాలు తొలగిపోతాయి
  12. సుగంధోదకం- పుత్ర సంతోషం కలుగుతుంది
  13. పుష్పొదకం- స్థిరాస్తి పెరుగుతుంది
  14. బిల్వ జాలం- ఆనందం వెల్లివిరుస్తుంది
  15. నువ్వుల నూనె- మృత్యు దోషం తొలగిపోతుంది
  16. రుద్రాక్షోదకం—ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది
  17. నవరత్న జలం- గృహ ప్రాప్తి కలుగుతుంది
  18. మామిడి పండు రసం- దీర్ఘకాలిక వ్యాధులు నయం అవుతాయి.
  19. పసుపు, కుంకుమ- మంగళ ప్రదం
  20. విభూది- కోటి రెట్ల ఫలితం దక్కుతుంది
  21. సువర్ణ జలం- దరిద్రం తొలగిపోతుంది
  22. ధవళోదకమ్- శివుడికి దగ్గరవుతారు
  23. గంగోదకం- సర్వ సమృద్ధి, సంపద ప్రాప్తి లభిస్తుంది
  24. కస్తూరీ జలం- రాజసం
  25. నేరేడు పండ్ల రసం- నిరాశ తొలగిపోతుంది