Tuesday Horoscope November 3 2026: కన్యా రాశి వారి కుటుంబ పరిస్థితులు కొంత ఇబ్బంది కలిగించినప్పటికీ.. ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి. రుణ సమస్యలను అధిగమించే ప్రయత్నం చేస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించడం మంచిది. కుంభ రాశి వారు చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేసుకుంటారు. డబ్బు రాక ఉంటుంది. చెడు పనులకు దూరంగా ఉంటూ స్నేహితులు, బంధువులను కలుసుకుంటారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి, అనారోగ్య బాధలు తగ్గిపోతాయి. దుర్గా అమ్మవారి సప్తశ్లోకి పారాయణం చేసుకోవాలి.
మిథున రాశి వారికి మీడియా, ఇతర రంగాలలో పనిచేసేవారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో అధికారిక గౌరవాలు పెరుగుతాయి. రావలసిన బాకీలు వసూలవుతాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నీలి శంఖ పుష్పాలతో పూజించాలి. ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు మంగళవారం (2026 నవంబర్ 3) నాటి ద్వాదశ రాశుల ఫలాలు, పాటించాల్సిన పరిహారాల సమగ్ర సమాచారంను భక్తి టీవీ వేదికగా అందించారు. కింది వీడియోలో మిగత రాశుల వారి దిన ఫలాలు ఉన్నాయి.

