Bakthi: ఏ పని ప్రారంభించిన తొలి పూజ వినాయకునికి చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఇలా మొదటి పూజ వినాయకుడికి చేసి పని ప్రారంభిస్తే ఎలాంటి ఆటంకాలు లేకుండా తలపెట్టిన పని విజయవంతంగా పూర్తవుతుందని ప్రజల నమ్మకం. అయితే వినాయకుడు స్వయంభూగా వెలసిన పుణ్యక్షేత్రం కాణిపాకం. ఆకాణిపాక వినాయకుని చరిత్ర ఏమిటి? అలానే ఆ గుడిలోని వినాయకుని విశిష్టత ఏమిటి ? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Read also:Ganesh Chathurthi: విఘ్నేశ్వరునికి తులసి ఆకులతో పూజ చేయకూడదు ఎందుకో తెలుసా..?
పూర్వము విహారపురి అనే గ్రామంలో ముగ్గురు సోదరులు ఉండే వారు. వారిలో ఒకరు మూగ వాడు, మరొకడు చెవిటి వాడు, ఇంకొకరు గుడ్డి వాడు, కాగా వారికి గ్రామం సమీపంలో కొంచం పొలముంది. వాళ్ళు ముగ్గురు కలిసి ఆ పొలాన్ని సాగు చేసుకునేవారు. అయితే ఎప్పటిలానే పొలానికి వెళ్లిన ముగ్గురు పంటకి నీరు పెట్టాలని ప్రయత్నిస్తారు. కాగా బావిలో నీరు కొద్దిగానే ఉండడం చేత ఆ నీరు బయటకి రాకుండ ఉంటుంది. ఈ నేపథ్యంలో చెవిటివాడు బావిలోకి దిగి బావిని మరికొంచం లోతుగా తొవ్వాలని గడ్డపారతో తొవ్వడం ప్రారంభిస్తాడు. అలా అతను తొవ్వుతున్నప్పుడు అతని గడ్డపారకి ఒక రాయి తగిలి రక్తం అతనిపైన చిమ్ముతుంది. వెంటనే అతనికి చెవులు వినిపిస్తాయి.
Read also:Vinayaka chavithi: వినాయకుని నిమజ్జనం ఇంట్లోనే ఇలా చెయ్యండి?
వెంటనే అతను తన సోదరులను తీసుకువెళ్లి ఆ రక్తం నిండిన బావిని చూపిస్తాడు. ఇలా తన సోదరులు ఆ నీటిని తాకగానే గుడ్డివాడికి చూపు వస్తుంది. మూగ వాడికి మాట వస్తుంది. ఈ విషయం ఊర్లో తెలిసి అందరూ ఆ భావి దగ్గరకి వచ్చి చూడగా ఆ రాయి నుండి రక్తం కారుతూ ఉంటుంది. ఓ పురోహితుడు కొబ్బరి కాయలు కొడితే ఆ నీరు స్వామి మీద పడి రక్తం రావడం ఆగిపోతుంది అని చెప్తాడు. దానితో రాజు ఆజ్ఞ మేరకు ప్రజలంతా కొబ్బరికాయలు తెచ్చి బావిలో కొడతారు. ఆ కొబ్బరి నీళ్ళకి ఒకటిన్నర ఎకరాల భూమి తడుస్తుంది. అందుకే ఈ ప్రాంతానికి కాణిపాకం అనే పేరు వచ్చింది. కాణి అంటే చిత్తడి.. పాకం అంటే నీరు ప్రవహించిన ప్రాంతం అని అర్ధం . అయితే బావిలో వెలసిన వినాయకుడు ఇప్పటికి భక్తులకు బావిలోనే దర్శమిస్తున్నాడు. అంతే కాదు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆ బావిలో నీరు ఇంకిపోదు. విశేషముగా విగ్నేశ్వరుడి విగ్రహం రోజు రోజుకి పెరుగుతుంది. ఈ వాస్తవానికి రుజువు కూడా ఉంది. కొన్ని దశాబ్దాల క్రితం ఓ భక్తుడు స్వామికి చేయించిన వెండి కవచం ప్రస్తుతం స్వామివారికి సరిపోవడం లేదు.