Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్నీ శుభ వార్తలే.. నేడు డబ్బే డబ్బు!

Sunday Horoscope August 23 2026

Sunday Horoscope August 23 2026

Sunday Horoscope August 23 2026: మీన రాశి వారికి నేడు కలిసిరానుంది. కుటుంబంలో సంతోషకరమైన వార్తలు వింటారు. గతంలో కోల్పోయిన ఆర్థిక ప్రయోజనాలను తిరిగి పొందుతారు. నాయకులతో సత్సంబంధాలు ఉంటాయి, విందు వినోదాలలో పాల్గొంటారు. డబ్బు రాక అధికంగా ఉంటుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం.. శ్రీ మహాగణపతి స్వామి వారు. మీరు చేయవలసిన పూజ.. గణపతి స్వామివారిని గరికతో పూజించడం మంచిది. ధనస్సు రాశి వారికి విద్యా, ఉద్యోగ రంగాల్లో మెరుగైన అవకాశాలు ఉంటాయి. విద్యార్థులకు లక్ష్యాలు పెరుగుతాయి. దుబారా ఖర్చులు తగ్గించుకుని సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. నారాయణి స్తోత్ర పారాయణం చేయడం మంచిది.

వృషభ రాశి వారికి ఈరోజు వ్యాపారంలో మార్పులు అనుకూలిస్తాయి. రావలసిన పాత బాకీలు వసూలవుతాయి. అనవసర ఖర్చులను తగ్గించుకుని నూతన మార్గాల ద్వారా ఆదాయాన్ని పొందేందుకు ప్రయత్నిస్తారు. నేడు మీకు అనుకూలించే దైవం.. శ్రీ మహాలక్ష్మీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ.. సౌందర్య లహరి స్తోత్ర పారాయణం చేయడం మంచిది. భక్తి టీవీ వేదికగా ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు నేటి (23 ఆగస్టు 2026) దిన ఫలాలు అందించారు. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు అందించబడ్డాయి.