Koti Deepotsavam 2024: కార్తీక పూర్ణిమ శుభవేళ.. కొనసాగుతున్న ప్రత్యేక పూజలు

  • భక్తి టీవీ ఆధ్వర్యంలో అంగరం వైభవంగా ‘కోటి దీపోత్సవం’
  • నేడు కార్తీక పౌర్ణమి
  • కొనసాగుతున్న విశేష పూజా కార్యక్రమాలు
Koti Dipodthavam

Koti Dipodthavam

భక్తి టీవీ ఆధ్వర్యంలో అంగరం వైభవంగా నిర్వహిస్తున్న ‘కోటి దీపోత్సవం’ వేడుకలో ఈరోజు విశేష పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి.  నవంబర్‌ 9న ఆరంభమైన ఈ దీపాల పండుగ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో దిగ్వజయంగా కొనసాగుతోంది. కాగా.. ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. హైదరాబాద్‌ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు కోటి దీపోత్సవ వేడుకకు చేరుకున్నారు.

 

ప్రస్తుతం అగ్నిలింగ క్షేత్రం తిరువణ్ణామలై శ్రీ అరుణాచలేశ్వర స్వామి కల్యాణం ఘనంగా నిర్వహిస్తున్నారు. అనంతరం వేదికపై స్వర్ణలింగానికి రజత బిల్వార్చన, అష్టోత్తరశత స్వర్ణపుష్పార్చన ఉంటుంది. భక్తులచే మహాకాళేశ్వరునికి కోటి పుష్పార్చన చేయిస్తారు. పల్లకీ వాహన సేవ నిర్వహిస్తారు. దీంతో పాటు పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ (అవధూత దత్తపీఠం, మైసూరు) అనుగ్రహ భాషణం చేయనున్నారు. మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ డా. గరికిపాటి నరసింహారావు గారు ప్రవచనామృతం వినిపించనున్నారు.

ఆరవ రోజు విశేష కార్యక్రమాలు:
# పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ (అవధూత దత్తపీఠం, మైసూరు) గారిచే అనుగ్రహ భాషణం
# మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ డా. గరికిపాటి నరసింహారావు గారిచే ప్రవచనామృతం
# వేదికపై స్వర్ణలింగానికి రజత బిల్వార్చన, అష్టోత్తరశత స్వర్ణపుష్పార్చన
# భక్తులచే మహాకాళేశ్వరునికి కోటి పుష్పార్చన
# అగ్నిలింగ క్షేత్రం తిరువణ్ణామలై శ్రీ అరుణాచలేశ్వర స్వామి కల్యాణం
# పల్లకీ వాహన సేవ