శనివారం శనీశ్వరుడిని పూజిస్తారు.. శని భాధల నుంచి విముక్తి కలిగించాలని వేడుకుంటారు.. శని దేవుడిని అందుకే చెడు దృష్టి కలవాడని అంటారు. శని స్థానం సరిగా లేకపోతే తిరవమైన కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆయన అనుగ్రహం పొందటం కోసం తప్పనిసరిగా పూజించాలని నమ్ముతారు. అప్పుడే శని దేవుడు సానుకూల ఫలితాలు ఇస్తాడు. శనివారం నాడు ఇవి చూస్తే మీకు అదృష్టం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఒకసారి చూద్దాం..
మీరు ఇంట్లో నుంచి బయటకి వెళ్లేటప్పుడు కొందరు ఎదురుపడితే చెడు ఎదురయ్యిందని అనుకుంటారు. అనుకున్న పనులు జరగకపోతే ఎదురొచ్చిన వారిని తిట్టుకుంటారు. కానీ శనివారం నాడు బిచ్చగాడు మీకు ఎదురుపడితే అంతా శుభమే జరుగుతుంది. బిచ్చగాడికి మీ స్థోమతకి తగినంత దానం చేయడం వల్ల శని దేవుడు సంతోషిస్తాడు..
హనుమంతుడికి హృద్యపూర్వకంగా పూజిస్తే వారికి శని దేవుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. హిందూ పురాణాల ప్రకారం హనుమంతుడి రావణుడి నుంచి శనిని రక్షించాడని నమ్ముతారు.. అందుకే ఆంజనేయ స్వామిని పూజిస్తే మంచిదట..
ప్రతి శనివారం రావి చెట్టు కొమ్మ మీద కొంచెం ఆవాల నూనె పోసి చెట్టు చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేయాలి. సూర్యోదయానికి ముందు ఈ పూజ చేయడం మంచిది. అలాగే శని భగవానుడికి ఇష్టమైన కాకికి ఆహారం పెట్టాలి. చాలా మంది కాకిని శుభసూచికంగా భావించరు. మంచి జరగాలంటే కాకికి భోజనం పెట్టాలి..
శని దేవుడు ను ఆరాధించడానికి ఉత్తమ మార్గాలలో ఒకటి పేదవారికి దానం చేయడం. మీ పూర్వీకుల కర్మలని తొలగించుకోవడం కోసం దానాలు చేస్తే మంచిది. అందుకు ప్రతిఫలంగా ఏమి ఆశించకూడదు. స్వచ్చందంగా ఎటువంటి కల్మషం లేకుండా దానం చేసే వాళ్లకు శని దేవుడు మంచే చేస్తాడు..
నల్ల పిల్లి, కుక్క ఎదురుపడితే ఏదో అశుభం జరగబోతుందని భయపడతారు. కానీ శనివారం రోజు నల్ల కుక్కని చూస్తే మంచిది. నలుపు రంగు శునకం కాలభైరవుడు అంశంగా భావిస్తారు. శనివారం రోజు నలుపు రంగు కుక్కలకు ఆహారం పెడితే శని దేవుడు ఆనందిస్తాడు..
చివరగా ఆవ నూనెతో శని దేవుడును పూజిస్తే అంతా మంచే జరుగుతుంది.. ఇక ఈరోజు నువ్వులను, ఉలవలను దానం చెయ్యడం వల్ల మంచి శుభవార్త వింటారు..