NTV Telugu Site icon

Navaratri Special : మొన్న గాజులతో.. నేడు పానీపూరిలతో దుర్గమ్మ అలంకరణ..వీడియో వైరల్..

Panipuri Durgamma

Panipuri Durgamma

దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరిస్తున్నారు.. ఒక్కో వాటితో అలంకరిస్తున్నారు.. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. నిజామాబాద్ నగరంలోని కిషన్ గంజ్ వద్ద గల వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలను ఆలయ కమిటీ 51 సంవత్సరాలుగా ఘనంగా నిర్వహిస్తున్నారు. మొదటి రోజు అమ్మవారిని పసుపు కొమ్ములతో అలంకరించారు. రెండవ రోజు లక్ష గాజులతో అలంకరించారు. 30 మంది మహిళలు శ్రమించి గర్భగుడి మొత్తం గాజులతో అమ్మవారిని అలంకరించారు.. ఇప్పుడు మరోచోట ఏకంగా పానీపూరిలతో దుర్గమ్మను అందంగా అలంకరించారు.. అందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

కోల్ కతా లో జరిగే నవరాత్రి వేడుకల్లో ఒక ప్రత్యేకత ఉంటుంది.. దక్షిణ శివారు బెహలాలోని ఒక దుర్గామండపం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది.. ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా అక్కడి వాసులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు.. వివరాల్లోకి వెళితే..

బెహలా నోటున్ దాల్ క్లబ్ ఏర్పాటు చేసిన ఈప్రత్యేక దుర్గా మండపం అందరి దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది. అలాగే సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మండపాన్ని పానీపూరీలతో అలకంరించారు. దీనిని గోల్‌గప్ప అని కూడా అంటారు. చాలామందికి ఇష్టమైన ఈ స్ట్రీట్‌ ఫుడ్‌తో దుర్గాపూజను ముడిపెట్టడాన్ని పలువురు ఎంజాయ్‌ చేస్తున్నారు. వ్యాపార దిగ్గజం హర్ష్ గోయెంకా ఈ దుర్గామండపంకు సంబందించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.. ఆ వీడియోనే ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది.. మీరు ఒక లుక్ వేసుకోండి..