Navaratri : పెద్దమ్మ తల్లి ఆలయంలో మూడు రోజుకు చేరుకున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దసరా శరన్నవరాత్రులు ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నాడు ప్రారంభమై ఆశ్వీయుజ శుద్ధ దశమి తో పూర్తవుతాయి. ఒక్కోరోజు ఒక్కో అవతారం ఎత్తి మహిషాసురుడు అనే రాక్షసుడిని అమ్మవారు సంహరించింది.. ఆ తర్వాత విజయానికి సంకేతంగా దసరా పండుగను జరుపుకుంటాం. అమ్మవారు వెలిసిన ప్రాంతాన్ని బట్టి అమ్మవారిని పలు అవతారాల్లో పూజిస్తారు.. శరన్నవరాత్రుల్లో ప్రజలు అత్యంత భక్తి నిష్టలతో దుర్గామాతను పూజిస్తారు. రోజుకో అలంకరణతో అమ్మవారికి ఇష్టమైన పుష్పాలతో పూజిస్తారు. నైవేద్యాలు పెడతారు.
దసరా నవరాత్రి ఉత్సవాలు మూడు రోజుకు చేరుకున్నాయి.. ఈరోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణ దేవి అలంకరణ లో దర్శనం ఇవ్వనున్నారు.. సకల జీవులకు అన్నం ఆధారం. కాశీ విశ్వేశ్వరుడి ప్రియ పత్నిగా శ్రీ అన్నపూర్ణా దేవి విరాజిల్లుతోంది. అన్నపూర్ణాదేవిని పూజిస్తే తిండికి లోటుండదు. సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఈరోజు అమ్మవారిని పూజించిన వారికి ఆకలిదప్పులు వంటి బాధలు ఉండవని చెబుతారు. అన్నపూర్ణా దేవి ఈరోజు గంధం రంగు చీరలో దర్శనం ఇస్తారు. తెల్లని పుష్పాల తో పూజిస్తారు. అమ్మవారికి ఎంతో ఇష్టమైన దద్ధోజనం నైవేద్యం పెడతారు. ఈరోజు అన్నదానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు.. అమ్మవారిని ఆ అలంకరణలో చూసేందుకు భక్తులు వేలాదిగా ఆలయానికి వస్తున్నారు.. రోజు రోజుకు భక్తుల సంఖ్య పెరుగుతుందని ఆలయ అధికారులు చెబుతున్నారు..
Also Read
- Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి వ్యాపారంలో డబ్బే డబ్బు!
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్నీ శుభ వార్తలే.. నేడు డబ్బే డబ్బు!
- Gajakesari Yoga 2026 : గజకేసరి యోగం.. ఈ రాశులకు గురు, చంద్రుల కలయికతో లక్ష్మీకటాక్షం.!
- Zodiac Signs : బుధ నక్షత్ర మార్పు.. ఆ 4 రాశుల వారికి సవాళ్లు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
తాజావార్తలు
-
Rajnath Singh: భారత్‌కు ఇక క్షిపణుల కొరత ఉండదు.. కేంద్రం సంచలన నిర్ణయం..
-
Tollywood : మీకు హిట్లు ఎప్పుడు?
-
TIMS : టిమ్స్‌లో ఇక సర్జరీలు.. నిమ్స్ తరహాలో తక్కువ ధరకే వైద్యం.!
-
Tarun Tejpal: అత్యాచారం కేసులో సుప్రీంకోర్టు షాక్.. 2 వారాల్లో లొంగిపోవాలని తేజ్‌పాల్‌కు ఆదేశం
-
Harish Rao : 22A భూములపై హరీశ్ రావు ఫైర్.. ‘కమీషన్ల కోసమే దోపిడీ!’
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!