సోమవారం పరమ శివుడికి చాలా ఇష్టమైన రోజు.. శివుడిని ఆరాధించడం వల్ల అన్ని బాధలు దూరమవుతాయి. అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. కోరిన కోరికలన్ని నెరవేరుతాయి. ఆ పరమశివుడు అభిషేక ప్రియుడు. భక్తులు ప్రేమతో అభిషేకాలు చేస్తే ఆనందంతో పొంగిపోతాడు.. అందుకే ఆయన భోళా శంకర్ అయ్యాడు.. అందుకే ఈరోజు కొన్ని పదార్థాలతో శివాభిషేకం చేస్తే మంచి ఫలితాలు దక్కుతాయి. శివుడు తెల్లటి వస్తువులతో సంబంధం కలిగి ఉంటాడు. పాలు, పెరుగు, పంచదార, బియ్యం మొదలైన వస్తువులతో అభిషేకం చేయాలి.. ఇలా చేస్తే కష్టాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పాలు.. పాలతో శివునికి అభిషేకం చేయడం వల్ల ఇంట్లో గొడవలు, మనస్పర్థలు దూరమవుతాయి. కుటుంబం లో శాంతి నెలకొంటుంది. కార్యాలయంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. టెన్షన్, ఆందోళన తొలగిపోతాయి.. ఆర్థిక సమస్యలు కూడా పోతాయి..
ఇక పెరుగుతో కూడా శివునికి అభిషేకం చేయడం వల్ల జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. అసంపూర్తిగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. జీవితంలో ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. మీరు అనుకున్న పనులు పూర్తవుతాయి.. మంచి లాభాలను పొందుతారు..
అదే విధంగా శివుడికి వెన్నతో అభిషేకం చేయడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయి. సంతాన సంతోషాన్ని పొందలేని దంపతులు సుఖాన్ని పొందుతారు. సంతానలేమి సమస్యలు పూర్తిగాf తగ్గుతాయి..
మహాశివుడికి చక్కెరతో అభిషేకం చేయడం వల్ల లివితేటలు, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోతాయన చెబుతున్నారు.