Mahabharata: మహాభారతంలో ఐదుగురు వీరుల మరణం.. ధర్మరక్షణకు ‘‘శ్రీకృష్ణుడి’’ మాస్టర్ ప్లాన్.!
- ధర్మాన్ని గెలిపించేందుకు శ్రీకృష్ణుడు అమలు చేసిన ఐదు కీలక యుద్ధ వ్యూహాలు.
- ద్రోణాచార్యుడి మరణం నుంచి భీష్ముడి పతనం వరకు కీలక మలుపులు.
- అభిమన్యుడి వీరమరణం, జయద్రథుడి వధ యుద్ధ గమనాన్ని మార్చిన ఘటనలు.
- కర్ణుడి దానగుణం, శిఖండి పాత్ర మహాభారతంలో ప్రత్యేక స్థానం పొందాయి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahabharata: మహాభారతం ఒక యుద్ధం మాత్రమే కాదు. మనిషి ఎలా ప్రవర్తించకూడదని చెప్పే ఒక గ్రంథం. ధర్మాలు, పాపాలు, తప్పులు, నైతికత, రాజకీయాలు, ప్రేమ, ప్రతీకారం ఇలా ప్రతీ క్యారెక్టర్‌కు ఒక్కో లక్షణం ఉంటుంది. ఈ ఇతిహాసంలో అనేక మలుపులు, ధర్మం గురించి క్లియర్ విశ్లేషణ ఉంటుంది. ఇక కురుక్షేత్ర యుద్ధం కేవలం యుద్ధంగా మాత్రమే పరిగణించలేము. ఆధునిక యుద్ధాలకు కావాల్సిన రాజనీతిని, వ్యూహాలను ఇప్పటికీ ఇస్తుంది. ఈ యుద్ధంలో ద్రోహాలు, మోసాలకు కూడా కొదువలేదు. స్వయంగా శ్రీకృష్ణుడి అంతటి వాడే, కొన్ని చర్యల ద్వారా కౌరవుల పక్షాన్ని మాయ చేసి, యుద్ధంలో గెలుపుకు పునాది వేశాడు. ఇప్పటికీ, కృష్ణుడు చేసిన ఈ సంఘటనలు విమర్శలకు గురవుతూనే ఉన్నాయి. కానీ, ఇక్కడ అంతరార్థం మాత్రం ‘‘శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ’’, ధర్మాన్ని ఎలాగైనా గెలిపించే ప్రయత్నంగానే చూడాలి.
1) ద్రోణాచార్యుడి మరణం:
గురువు ద్రోణాచార్యుడి మరణం మహాభారతంలో నేలకొరిగిన ఒక యోధుడిని గురించి తెలుపుతుంది. అప్పటి వరకు అరివీర భయంకరంగా యుద్ధం చేస్తూ పాండవ పక్షాన్ని ఓడిస్తున్న ద్రోణాచార్యుడిని ఒక్క అబద్ధం బలితీసుకుంది. ద్రోణుడికి తన కుమారుడి అశ్వత్థామపై చాలా ప్రేమ. ఈ ప్రేమే చివరకు ద్రోణుడి మరణానికి కారణమైంది. కృష్ణుడి సలహా మేరకు ధర్మరాజు .. ‘‘ అశ్వత్థామ హత:’’ అని పెద్దగా చెప్పి ‘‘కుంజర:(ఏనుగు)’’ గురించి మెల్లిగా చెబుతాడు. అబద్ధం ఆడలేని ధర్మరాజు అశ్వత్థామ అనే పేరున్న ఏనుగు మరణించిందని ద్రోణుడికి చెబుతాడు. ఈ అర్ధసత్యం ద్రోణాచార్యుడిని కుదిపేసింది. అతను తన ఆయుధాలను విడిచిపెట్టి ధ్యానంలోకి వెళ్ళాడు. అదే క్షణంలో ధృష్టద్యుమ్నుడు అతన్ని సంహరించాడు. ఈ సంఘటన మహాభారతంలోని గొప్ప మలుపుగా అభివర్ణించబడుతుంది.
Also Read
- Chanakya Niti: జీవితంలో గెలవాలంటే 'చాణక్యుడి' ఈ ఒక్క సూత్రం చాలు.. శత్రువులను కూడా ఈజీగా బురిడీ కొట్టించవచ్చు!
- Most Powerful Weapons: మహాభారతంలో ఆ 11 అస్త్రాలు గనుక ప్రయోగిస్తే.. బూడిదే! దేవతలు సైతం వణికిపోయిన ఆయుధాలు ఇవే!
- Mahabharata Unknown Facts: మహాభారతంలో ఆ నలుగురు ఆయుధం పట్టి ఉంటే.. కురుక్షేత్రం రిజల్ట్ వేరేలా ఉండేది! ఆ మహావీరులు ఎవరో తెలుసా?
- Shani Trayodashi 2026: రేపే శని త్రయోదశి.. పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయొద్దు..
2) చక్రవ్యూహం, అభిమన్యుడి హత్య:
అర్జునుడి కుమారుడు అభిమన్యుడి యుద్ధానికి కౌరవ సేన అతలాకుతలం అయింది. కేవలం యవ్వన ప్రాయంలో ఉన్న అభిమణ్యుడు చేస్తున్న యుద్ధాన్ని గురువులు ద్రోణుడు, కృపాచార్యుడు, కర్ణుడు వంటి పెద్ద యోధులు కూడా తట్టుకోలేకపోయారు. చక్రవ్యూహంలోకి వెళ్లిన అభిమన్యుడి ధాటికి ఆ రోజే కురక్షేత్ర యుద్ధం ముగిసి, పాండవులు గెలిచే స్థాయికి వెళ్లింది. అయితే, యుద్ధ నియమాలు ఉల్లంఘించి, ఒంటరిగా ఉన్న అభిమన్యుడిపైకి కౌరవసేన మూకుమ్మడిగా దాడి చేయడం, వెనక నుంచి కర్ణుడు దెబ్బతీయడంతో మరణిస్తారు. మహాభారతంలో అత్యంత క్రూరమైన హత్యగా దీనిని పరిగణిస్తారు.
3) జయద్రధుడి వధ:
అభిమన్యుడి మరణం తర్వాత, మరుసటి రోజు సూర్యాస్తమయం లోగా జయధ్రదుడిని చంపుతానని, లేదంటే తనే అగ్నిలోకి దూకి చనిపోతానని అర్జునుడు శపథం చేస్తాడు. జయధ్రదుడిని రక్షించేందుకు కౌరవసేన యుద్ధానికి చాలా దూరంలో అతడిని ఉంచుతుంది. సూర్యస్తమయం సమీపిస్తున్న అతడి జాడను అర్జునుడు కనుక్కోలేకపోతాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో సూర్యుడికి కప్పే్స్తాడు. చీకటి పడటంతో తన ప్రాణాలకు ప్రమాదం లేదని భావించిన జయద్రధుడు ఒక్కసారిగా దాక్కున్న చోటు నుంచి బయటకు వచ్చి సంబరాలు చేసుకుంటాడు. ఆ సమయంలో సుదర్శన చక్రం తప్పుకోవడంతో సూర్యుడి వెలుగు బయటకు వస్తుంది. సరిగా అదే క్షణంలో అర్జునుడు అతడిని సంహరిస్తాడు.
4) కర్ణుడి కవచకుండలాలు దానం:
సూర్యుడి కుమారుడి కర్ణుడుకి ఉన్న దివ్యమైన కవచాలు, చెవిపోగుల్ని ఇంద్రుడికి దానంగా ఇస్తాడు. కర్ణుడు అర్జునుడిని ఓడిస్తాడనే భయంతో ఇంద్రుడు ఇలా వరం కోరారని చెబుతుంటారు. కానీ, సాధనకు దేవుడిగా ఉన్న ఇంద్రుడు కర్ణుడిని పరీక్షించడానికి దానాన్ని కోరుతాడని మహర్షులు చెబుతుంటారు. ఇలా దానం అడిగే విషయాన్ని సూర్యుడు ముందుగానే కర్ణుడికి కవచకుండలాలు ఇవ్వొద్దని చెబుతాడు. ఇంద్రుడు దానం అడగడంతో తన కవచకుండలాను కర్ణుడు దానంగా ఇస్తాడు, దీనికి ప్రతిఫలంగా ఇంద్రుడు అత్యంత శక్తివంతమైన ‘‘శక్తి అస్త్రాన్ని’’ కర్ణుడికి ఇస్తాడు. ఇదే అస్త్రాన్ని కర్ణుడు ఘటోత్కచుడిపై వాడి సంహరిస్తాడు. నిజానికి ఈ అస్త్రాన్ని కర్ణుడు అర్జునుడి కోసం వాడాలని అనుకుంటాడు. చివరకు ఘటోత్కచుడి విధ్వంసాన్ని ఆపేందుకు ఇలా వాడాల్సి వస్తుంది.
5) భీష్మ పితామహుడు-శిఖండి యుద్ధం:
భీష్ముడికి ఇచ్చాపూర్వక మరణం అనే వరం ఉంటుంది. తాను కోరుకున్నప్పుడే మరణించే వరం ఉంది. అయితే, అతడిని సంహరించేందుకు అంబనే శిఖండి రూపంలో, శివుడి వరాన్ని పొంది భీష్ముడిని చంపేందుకు వస్తుంది. ద్రుపదుడి కుమార్తెగా జన్మించి, ఆ తర్వాత పురుషుడిగా మారి భీష్ముడిని చంపుతాడు. అంబ పూర్వ జన్మ గురించి భీష్ముడికి ముందే తెలుసు. దీంతో శిఖండి పైకి ఆయుధాలు ఎక్కుపెట్టలేదు. చివరకు అర్జునుడి శిఖండి వెనక నుంచి బాణాలు వేసి భీష్ముడు కింద పడిపోయేలా చేస్తాడు.
తాజావార్తలు
-
Mahabharata: మహాభారతంలో ఐదుగురు వీరుల మరణం.. ధర్మరక్షణకు ‘‘శ్రీకృష్ణుడి’’ మాస్టర్ ప్లాన్.!
-
Dil Raju: ‘సినిమాల్లో ఫెయిలైతే మళ్లీ అక్కడికే వెళ్లిపోయే వాడిని..’: ప్రొడ్యూసర్ దిల్ రాజు
-
Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
-
Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్‌కు పూనకాలే..
-
CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్‌బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..