NTV Telugu Site icon

Surya Grahan In India : రేపే ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం.. సమయం, వివరాలు ఇవే..

Surya Grahan

Surya Grahan

తెలుగు నెలలో చివరి మాసం ఫాల్గుణ మాసం. కాబట్టి ఈ ఏడాది చివరి అమావాస్య ఈ నెల 29న రానుంది. మార్చి 29న(రేపు) సంభవించనుంది. ఈ గ్రహణం మీన రాశిలో సంభవిస్తుంది. కానీ.. ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. ఇది పాక్షిక సూర్యగ్రహణం. ఈ ఏడాది మొదటి పాక్షిక సూర్యగ్రహణం యూరప్, ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అట్లాంటిక్, ఆర్కిటిక్ మహాసముద్రం, బార్బడోస్, బెల్జియం, ఉత్తర బ్రెజిల్, బెర్ముడా, ఫిన్లాండ్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీన్లాండ్, హాలండ్, నార్వే, పోలాండ్, పోర్చుగల్, రొమేనియా, ఉత్తర రష్యా, స్పెయిన్, మొరాకో, ఉక్రెయిన్, ఉత్తర అమెరికా తూర్పు ప్రాంతాలు, ఇంగ్లాండ్ మొదలైన ప్రాంతాల్లో కనిపిస్తుంది.

READ MORE: UP: టీచర్-అంగన్‌వాడీ వర్కర్ డబ్ల్యూడబ్ల్యూఈ ఫైటింగ్.. వీడియో వైరల్

అయితే.. భారత కాలమానం ప్రకారం.. శనివారం మధ్యాహ్నం 2:20 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6:16 గంటలకు ముగుస్తుంది. ఇది పాల్గుణ మాసం కృష్ణ పక్ష అమావాస్య రోజున సంభవించే పాక్షిక సూర్యగ్రహణం. గ్రహణం సందర్భంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణకాలంలో చేయాల్సిన పరిహారాలు ఏంటి? ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు గ్రహణకాలంలో జాగ్రత్తలు తీసుకోవడం అవసరమేనా! అని అందరికీ సందేహాలు వస్తుంటాయి. మన దేశంలో కనిపించదు కాబట్టి సూత కాలం అంటూ మనకు ఏమీ ఉండదు. ఎలాంటి జాగ్రత్తలు, పరిహారాలు పాటించాల్సిన అవసరం లేదని జ్యోతిష్య శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

READ MORE: AIMIM : ఈద్ ప్రార్థనలపై మాటల యుద్ధం.. రోడ్డు మీద నమాజ్ చేస్తామన్న ఎంఐఎం నేత…