Krishna Janmashtami : కృష్ణాష్టమి రోజు ఈ మంత్రాలు జపిస్తే.. కృష్ణుడి అనుగ్రహం..!
- 108 సార్లు జపించాల్సిన మంత్రం
- కష్టాలు తొలగించే ద్వాదశాక్షరీ మంత్రం
- జాగరణలో ఈ శ్లోకం ప్రత్యేకం
- తులసి మాలతో జపిస్తే శుభఫలాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Krishna Janmashtami : భాద్రపద మాసంలో వచ్చే కృష్ణాష్టమి పండగకు హిందూ సంప్రదాయంలో ఎంతో విశిష్టత ఉంది. కంసుని చెరసాలలో వసుదేవుడు, దేవకిల అష్టమ గర్భంలో శ్రీకృష్ణుడు జన్మించిన పవిత్ర రాత్రిని భక్తులు కృష్ణాష్టమిగా అపారమైన భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ముఖ్యంగా మధుర, గోకుల, బృందావనాలలో భక్తులు రోజంతా ఉపవాసం ఉండి, అర్ధరాత్రి వరకు జాగరణ చేస్తారు. శంఖారావాలు, గంటల శబ్దాలు, వేదమంత్రాలు , భజనల నడుమ బాలకృష్ణుడిని ఆరాధిస్తారు. ఈ పవిత్రమైన రోజున శ్రీకృష్ణుడి అనుగ్రహం పొందడానికి , కలియుగంలో కష్టాల నుండి ఉపశమనం పొందడానికి జపించాల్సిన కొన్ని ముఖ్యమైన మంత్రాలు విశేష ఫలాన్ని ఇస్తాయి.
హరే కృష్ణ మహా మంత్రం , పంచతత్వ మంత్రం
కృష్ణాష్టమి రోజున తులసి మాలను చేతిలో పట్టుకుని ‘హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే.. హరే రామ హరే రామ రామ రామ హరే హరే’ అనే మహా మంత్రాన్ని 108 సార్లు లేదా కనీసం 16 సార్లు జపించడం ఎంతో శ్రేయస్కరం. ఉపనిషత్తుల ప్రకారం కలియుగంలో ఎదురయ్యే సకల కష్టాలు, మానసిక అలజడుల నుంచి బయటపడటానికి ఈ మహా మంత్రం ఒక సులువైన మార్గం. ఇక ఏదైనా భక్తి కార్యక్రమం లేదా జపం ప్రారంభించే ముందు ‘జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద.. శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌర భక్త బృందా’ అనే పంచతత్వ మంత్రాన్ని పఠించడం విశేష ఫలాన్ని ఇస్తుంది. మహా మంత్రాన్ని ప్రారంభించే ముందు పంచభూతాల నామాలను జపిస్తూ వాటికి నమస్కరించడం ద్వారా ఆధ్యాత్మిక ప్రశాంతత లభిస్తుంది.
Also Read
- Janmashtami 2026 Fasting Rules: కృష్ణ జన్మాష్టమి 2026.. ఉపవాసం నుంచి నిశీథి పూజ వరకు పూర్తి వివరాలు
- Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని ధన లాభాలు!
- Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు!
- Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
ద్వాదశాక్షరీ మంత్రం , బ్రహ్మ సంహిత శ్లోకం
శ్రీకృష్ణునికి అంకితం చేయబడిన ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అనే మంత్రంలో మొత్తం 12 అక్షరాలు ఉంటాయి, అందుకే దీనిని ‘ద్వాదశాక్షర మంత్రం’ అని పిలుస్తారు. పూజా సమయంలో శ్రీకృష్ణుని చిత్రపటం ముందు కూర్చుని, స్వామివారికి పుష్పాలను సమర్పిస్తూ తులసి మాలతో ఈ మంత్రాన్ని జపించడం వల్ల భక్తుల కష్టాలు తొలగిపోయి, కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వసిస్తారు. అలాగే సృష్టి కార్యాన్ని చేపట్టే ముందు బ్రహ్మదేవుడు శ్రీమహావిష్ణువును స్తుతిస్తూ చెప్పిన ‘ఈశ్వరః పరమః కృష్ణః సచ్చిదానంద విగ్రహః.. అనాదిర్గోవిందః సర్వకరణకరణం’ అనే శ్లోకాన్ని కృష్ణాష్టమి జాగరణ సమయంలో , అర్ధరాత్రి స్వామివారి అభిషేకానికి ముందు పఠిస్తారు. ఈ పవిత్ర మంత్రాలను భక్తితో స్మరించడం వల్ల మనస్సు నిర్మలంగా మారి దైవానుగ్రహం సిద్ధిస్తుంది.
తాజావార్తలు
-
Krishna Janmashtami : కృష్ణాష్టమి రోజు ఈ మంత్రాలు జపిస్తే.. కృష్ణుడి అనుగ్రహం..!
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!