Koti Deepotsavam 2026: గరికిపాటి ప్రవచనం, ఏకామ్రేశ్వరస్వామి కల్యాణం.. కోటి దీపోత్సవంలో నేటి విశేష కార్యక్రమాలు ఇవే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Koti Deepotsavam 2026: హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దీపోత్సవం 2026 కన్నుల పండుగగా సాగుతోంది.. కార్తీక మాసం సందర్భంగా భక్తి టీవీ నిర్వహిస్తున్న కోటి దీపోత్సవంలో భాగంగా నేడు (నవంబర్ 23) పదో రోజు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కార్తీక రెండో సోమవారం, వైకుంఠ చతుర్దశి సందర్భంగా స్వామివారి పూజలు, ప్రవచనాలు, కల్యాణోత్సవం తదితర కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
నేటి కోటి దీపోత్సవం ప్రత్యేక కార్యక్రమాల షెడ్యూల్
Also Read
- Sabarimala Alert: అయ్యప్ప భక్తులకు అలర్ట్.. పంబా నదిలో బట్టలు పడేస్తే భారీ ఫైన్.. ఆ ఆచారానికి చెక్..
- Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి లాభాలే లాభాలు!
- Koti Deepotsavam 2026 : మీనాక్షి సుందరేశ్వరుల కల్యాణంతో కోటి దీపోత్సవంలో భక్తి పారవశ్యం.!
- Kartik Purnima 2026: కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడికి అర్ఘ్యం.. సరైన టైమ్ ఇదే.!
1. అనుగ్రహ భాషణం: శ్రీ సంపూర్ణానందగిరి స్వామీజీ (శ్రీకాళహస్తి శ్రీ శుకబ్రహ్మాశ్రమం), శ్రీశ్రీశ్రీ శివ స్వామీజీ (శ్రీ పైవేక్షేత్రం)
2. ప్రవచనామృతం: పద్మశ్రీ పురస్కార గ్రహీత, మహాసహస్రావధాని డాక్టర్ గరికిపాటి నరసింహారావు ఆధ్యాత్మిక ప్రవచనం
3. వేదికపై పూజా కార్యక్రమాలు: నవధాన్య లింగార్చన, ఉజ్జయిని మహాకాళి భస్మ హారతి
4. భక్తులచే పూజ: శివలింగాలకు నవధాన్యాలతో అర్చన నిర్వహించనున్నారు.
5. కల్యాణం: కంచి శ్రీ ఏకామ్రేశ్వరస్వామి కల్యాణోత్సవం నిర్వహించనున్నారు.
6. వాహన సేవ: స్వామివారికి పల్లకి సేవ నిర్వహించనున్నారు.
కార్తీక మాసంలోని పవిత్రమైన రెండో సోమవారం, వైకుంఠ చతుర్దశి సందర్భంగా నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక కార్యక్రమాలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందించనున్నాయి. ప్రవచనాలు, విశేష పూజలు, స్వామివారి కల్యాణోత్సవంతో నేటి కోటి దీపోత్సవ కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఇక, భక్తులకు ఉచితంగా పూజా సామాగ్రిని కూడా అందజేస్తోంది రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్.. మీరు ఈ కార్యక్రమానికి హాజరై పూజలు, దీపారాధన చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు నిర్వాహకులు..

తాజావార్తలు
-
Koti Deepotsavam 2026: గరికిపాటి ప్రవచనం, ఏకామ్రేశ్వరస్వామి కల్యాణం.. కోటి దీపోత్సవంలో నేటి విశేష కార్యక్రమాలు ఇవే..!
-
Ajith-MS Dhoni: ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు ‘తలా’లు.. మధ్యలో సూపర్ స్టార్.. పిక్స్ అదిరిపోలా!
-
TTD: తిరుమల భక్తులకు అలర్ట్..
-
Ind vs Pak Controversy: తిలక్ వర్మతో గొడవ.. హర్షిత్ రాణాను స్లెడ్జ్.! పాకిస్థాన్ ఆటగాళ్ల ఓవర్ యాక్షన్..
-
Abdul Samad: భారత్‌పై విజయం.. ఐయామ్ ఫుల్ హ్యాపీ.. పాక్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
India A vs Pakistan A: భారత్‌కు షాక్.. రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో పాకిస్థాన్ చేతిలో ఓటమి..!
-
Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్‌తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!