Koti Deepotsavam 2026 Day 7: కార్తీక శుక్రవారం.. ప్రబోధిని ఏకాదశి.. కోటి దీపోత్సవంలో నేటి విశేషాలివే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Koti Deepotsavam 2026 Day 7: కార్తీక మాసం సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ఎన్టీవీ, భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం 2026 భక్తి పారవశ్యంతో కొనసాగుతోంది. ఈ మహోత్సవంలో భాగంగా నేడు (నవంబర్ 20, శుక్రవారం) ఏడో రోజు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. కార్తీక శుక్రవారం, ప్రబోధిని ఏకాదశి పర్వదినం కావడంతో నేటి కార్యక్రమాలకు విశేష ప్రాధాన్యత సంతరించుకుంది. స్వామీజీల అనుగ్రహ భాషణం, ఆధ్యాత్మిక ప్రవచనం, త్రిశక్తి మహాపూజ, ప్రత్యేక అర్చనలు, కల్యాణోత్సవం వంటి కార్యక్రమాలు భక్తులను ఆధ్యాత్మిక లోకంలో విహరింపజేయనున్నాయి.
నేటి ప్రత్యేక కార్యక్రమాల షెడ్యూల్
Also Read
- Devuthani Ekadashi 2026: నేడు దేవుని ఉత్థాన ఏకాదశి.. ఈ 5 తప్పులు చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుందట..!
- Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో మరో అద్భుత ఘట్టం.. కనులపండువగా లక్ష్మీనృసింహుడి కల్యాణం
- Koti Deepotsavam 2026 Day-6 Live: ఆరో రోజు వేడుకలు.. నేటి ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు..
- Astrology Predictions : డిసెంబర్ 2026 గ్రహ సంచారాలు.. ఈ ఐదు రాశులకు పట్టిందల్లా బంగారమే
1. అనుగ్రహ భాషణం – శ్రీ విశ్వప్రసన్నతీర్థ స్వామీజీ (ఉడుపి పెజావర్ మఠం)
2. ప్రవచనామృతం – శ్రీ మల్లాది సూర్యనారాయణ శర్మ (ఆధ్యాత్మిక ప్రవచనకర్త)
3. వేదికపై పూజ – మైసూరు చాముండేశ్వరి, వర్గల్ సరస్వతి, కొల్లాపూర్ మహాలక్ష్మి అమ్మవార్లకు త్రిశక్తి మహాపూజ
4. భక్తులచే పూజ – సరస్వతి విగ్రహాలకు విశేషార్చన
5. కల్యాణం – అలంపురం శ్రీ జోగులాంబ కల్యాణం
6. వాహన సేవ – గజ వాహనం
త్రిశక్తి మహాపూజ ప్రత్యేక ఆకర్షణ
నేటి కోటి దీపోత్సవంలో త్రిశక్తి మహాపూజ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. మైసూరు చాముండేశ్వరి, వర్గల్ సరస్వతి, కొల్లాపూర్ మహాలక్ష్మి అమ్మవార్లకు ప్రత్యేకంగా త్రిశక్తి మహాపూజ నిర్వహించనున్నారు. అలాగే సరస్వతి విగ్రహాలకు భక్తులచే విశేషార్చన జరగనుంది. నేటి కార్యక్రమాల్లో అలంపురం శ్రీ జోగులాంబ అమ్మవారి కల్యాణం మరో విశేషం. అనంతరం గజ వాహనంపై స్వామివారి వాహన సేవ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలు భక్తులకు కనులపండువగా నిలవనున్నాయి. కార్తీక శుక్రవారం, ప్రబోధిని ఏకాదశి పర్వదినం సందర్భంగా నిర్వహించే ఈ ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని దైవానుగ్రహాన్ని పొందాలని సాదరంగా ఆహ్వానం పలుకుతుంది రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్..

Koti Deepotsavam Day 7
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 7: కార్తీక శుక్రవారం.. ప్రబోధిని ఏకాదశి.. కోటి దీపోత్సవంలో నేటి విశేషాలివే!
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
PUC New Rules 2026: కారు, బైక్ యజమానులకు గుడ్ న్యూస్.. ఇక 3 ఏళ్ల వరకు PUC రెన్యువల్ అవసరం లేదు!
-
Cyclone Akvan: అక్వాన్ తీవ్ర తుపాన్ తీరం దాటే ప్రక్రియ ప్రారంభం.. వణుకుతున్న ఉత్తరాంధ్ర.. కీలక హెచ్చరిక!
-
Home Decor Ideas: పాత ప్లాస్టిక్ కుర్చీలను పనికిరావని పడేస్తున్నారా? ఇలా చేస్తే అస్సలు పడేయరు!
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!