NTV Telugu Site icon

Koti Deepotsavam 2024 Day 8: కార్తిక శనివారం శుభవేళ.. కోటిదీపోత్సవం వేదికపై వరసిద్ధి వినాయకుడి కల్యాణం..

Koti Deepotsavam 2024 Day 8

Koti Deepotsavam 2024 Day 8

Koti Deepotsavam 2024 Day 8: కార్తిక మాసం శుభవేళ.. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియం వేదికగా కోటి దీపోత్సవం వైభవంగా సాగుతోంది.. రోజుకో కల్యాణం.. వాహనసేవలు, పీఠాధిపతుల ప్రవచనాలు.. ప్రముఖుల ఉపన్యాసాలు.. సాంస్కృతిక కార్యక్రమాలు.. ఇలా భక్తులను కోటి దీపోత్సవ వేదిక కట్టిపడేస్తోంది.. పరిసర ప్రాంతాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి.. ఇప్పటికే ఏడు రోజుల విశేష కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకోగా.. ఈ రోజు ఎనిమిదో రోజు మరిన్ని కార్యక్రమాలకు సిద్ధం అవుతోంది భక్తి టీవీ..

ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీ ఆధ్వర్యంలో జరుగుతోన్న కోటి దీపోత్సవంలో ఈ రోజు జరనున్న విశేష కార్యక్రమాల విషయానికి వస్తే.. శ్రీ సుబ్రహ్మణ్యమఠం మాఠాధిపి శ్రీ విద్యాప్రసన్న తీర్థ స్వామీజీ అనుగ్రహ భాషణం.. బ్రహ్మశ్రీ జొన్న విత్తుల రామలింగేశ్వరరావు.. ప్రవచనామృతం.. వేదికపై కాజీపేట శ్వేతార్క గణపతికి సప్తవర్ణ మహాభిషేక సహిత కోటి గరికార్చన.. భక్తులచే గణపతి విగ్రహాలకు కోటి గరికార్చన.. కోటి దీపోత్సవ వేదికపై శ్రీ వరసిద్ధి వినాయక స్వామి కల్యాణం.. ఆ తర్వాత వరసిద్ధి వినాయకుడికి మూషిక వాహన సేవ నిర్వహించనున్నారు.. కోటి దీపోత్సవానికి అందరూ ఆహ్వానితులే.. కార్తిక మాసం శుభవేళ కోటి దీపోత్సవంలో పాల్గొనాల్సిందిగా భక్తులను సాదరంగా ఆహ్వానిస్తోంది రచన టెలివిజన్‌ ప్రైవెట్‌ లిమిటెడ్‌.. ఈ ఉత్సవంలో పాల్గొనే భక్తులకు పూజా సామగ్రి కూడా భక్తి టీవీ ఉచితంగా అందజేస్తోన్న విషయం విదితమే కాగా.. హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడుపుతోన్న విషయం విదితమే..

ఇక, నిన్నటి కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దంపతులు పాల్గొన్నారు.. “కార్తీక పౌర్ణమి శుభ సందర్భంగా భక్తి టీవీ ఆధ్వర్యంలో జరిగిన కోటి దీపోత్సవంలో సతీ సమేతంగా పాల్గొనడం జరిగింది. దీపకాంతుల నడుమ.. హిందూ సాంప్రదాయ వైభవం.. ఆధ్యాత్మిక ప్రాభవం.. కలగలిసిన అనుభూతి పొందాను. ఈ శుభ దినాన.. ఆ మహాశివుడి ఆశీస్సులు.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల పై.. చల్లని వెన్నెల్లా ప్రసరించాలని.. కోరుకున్నాను.” అంటూ సోషల్‌ మీడియా వేదికగా కోటి దీపోత్సవం ఫొటోలు పంచుకుంటూ ఓ పోస్ట్‌ పెట్టారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి..

Show comments