NTV Telugu Site icon

Koti Deepotsavam 2024: దిగ్విజయంగా ముగిసిన కోటి దీపోత్సవం.. 17 రోజుల పాటు సాగిన మహా క్రతువు..

Koti Deepotsavam 2024

Koti Deepotsavam 2024

Koti Deepotsavam 2024: ప్రతీ ఏడాది కార్తిక మాసంలో భక్తి టీవీ, ఎన్టీవీ, వనిత టీవీ ఆధ్వర్యంలో నిర్వహించే కోటి దీపోత్సవం దిగ్విజయంగా ముగిసింది.. ఈ నెల 9వ తేదీన ప్రారంభమైన ఈ మహా దీపయజ్ఞం 17 రోజుల పాటు కొనసాగాయి.. ఈ నెల 25వ తేదీన అంటే.. కార్తిక చివరి సోమవారం రోజు ముగిసింది.. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో 17రోజులపాటు జరిగిన మహాసంబరం ఆసేతు హిమాచలాన్ని ఆకట్టుకుంది. నభూతో నా భవిష్యత్‌ అనే తీరులో సాగిన కార్యక్రమానికి భారత దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము.. పలు రాష్ట్రాల గవర్నర్‌లు.. కేంద్ర మంత్రులు దిగ్విజయ్‌ సింగ్‌, కిషన్‌ రెడ్డి.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, పొంగులేటి, తుమ్మల సహా.. హైకోర్టులో న్యాయమూర్తులు.. ఇతర ప్రముఖులు హాజరై ఈ దీపయజ్ఞంలో భాగస్వాములు అయ్యారు.. దీపాలు వెలిగించడం ఏకత్వాన్ని సూచిస్తుందని ప్రశంసలు కురిపించారు..

Read Also: CM Revanth: నేడు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో సీఎం రేవంత్ భేటీ..

ఏటికేడు దైదీప్యమానంగా ఈ మహా సంబరం వెలిగిపోతుంది. గతేడాది ప్రధాని నరేంద్ర మోడీ ఈ కార్యక్రమంలో పాల్గొనగా, ఈ ఏడాది దేశానికి ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము విచ్చేసారు. విశిష్ట అతిథిగా హాజరైన రాష్ట్రపతి కోటి దీపోత్సవంలో పూరీ జగన్నాథునికి ప్రత్యేక పూజలు చేశారు. యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు. తొలి కార్తీక దీపాన్ని రాష్ట్రపతి వెలిగించారు. ఇల కైలాసంలో కార్తికమాసం వేళ భక్తి, ఎన్టీవీ చేపుడుతున్న కోటి దీపోత్సవ కార్యక్రమం ఆధ్యాత్మికను మరింత ముందుకు తీసుకువెళ్తుందుని పీఠాధిపతులు, స్వామిజీలు వేనోళ్ల కొనియాడారు. నవంబర్‌ 9న ఆరంభమైన దీపాల పండుగ.. నవంబర్‌ 25 వరకు అప్రతిహాతంగా సాగింది. 17రోజులపాటు సాగిన ఈ మహా క్రతువుకు హైదరాబాద్‌ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఆశేష జనవాహిని పాల్గొంది. ప్రతీ రోజు ప్రత్యేక అలంకారాలు.. కోటిదీపోత్సవం దేవికగా దేవానదేవతులు కల్యాణాలు.. రోజుకో పల్లకి సేవా.. ప్రతీ రోజు ఓ విశిష్ట అతిథి.. పీఠాధిపతులు.. మఠాధిపతుల ప్రవచనాలు.. ఇలా 17 రోజుల పాటు భక్తులు పరవశింపజేశాయి.. శివనామస్మరణతో మార్మోగిన ఎన్టీఆర్‌ స్టేడియం పరిసరాలు.. భక్తజన సంద్రంగా మారిపోయాయి.. తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను నడిపి.. భక్తులను తరలించేందుకు తోడ్పాటును అందించింది.. చివరి రోజు మహా మంగళ హారతి దర్శనంతో కోటి దీపోత్సవ వేడుకలు ముగిశాయి. ఈ కోటి దీపయజ్ఞం దిగ్విజయం కాకడానికి కృషి చేసిన అందరికీ.. భక్త జనానికి భక్తి టీవీ, ఎన్టీవీ, వనిత టీవీ ధన్యవాదాలు తెలుపుతోంది..