హైదరాబాద్ మహానగరంలో ఏటా గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. అందులో ఖైరతాబాద్ గణేశుడిది ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి ఏడాది ఒక ప్రత్యేక అవతారంలో దర్శనమిచ్చే గణనాథుడు ఈసారి ‘శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి’గా భక్తులకు దర్శనమివ్వనున్నాడు. ఖైరతాబాద్ వినాయకుడిని 70 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ ఏడాది లంబోధరుడు 7 తలలు, 14 చేతులు, తలలపై నాగసర్పాలు…పీఠం అన్నీ కలిపి 70 అడుగుల ఎత్తులో కొలువుతీరనున్నాడు. గతంలో తయారైన సప్తముఖ గణపతికి భిన్నంగా ఈ సారి విగ్రహాన్ని తయారుచేసిన్నట్టు శిల్పి చెప్పారు.
READ MORE: Ganesh Chaturthi: లంబోధరుడిని ప్రతిష్ఠిస్తున్నారా?.. ఇదే అనువైన ముహూర్తం
చరిత్ర..
1893లో మహారాష్ట్ర పుణె కేంద్రంగా సర్వ జనైఖ్య గణేశ్ ఉత్సవాలకు నాయకులు పిలుపునిచ్చారు. గణపతి ఉత్సవాలను సామాజిక వేదికలుగా చేసి కార్యక్రమాలు నిర్వహించడం ప్రారంభించారు. ఈ వేడుకల్లో కుల మతాలకు అతీతంగా ప్రతిఒక్కరూ పాల్గొన్నారు. లోకమాన్య బాలగంగాధర తిలక్ గణేశోత్సవానికి జాతీయ గుర్తింపు ఇవ్వడంలో కీలకపాత్ర పోషించారు. నాటి నుంచి వినాయక నవరాత్రులు మహారాష్ట్రను దాటి భారతదేశమంతటా నిర్వహించడం ఆనవాయితీగా మారింది. కాగా.. 1954లో ఒక్క అడుగుతో ఖైరతాబాద్ గణేషుడు ప్రారంభమయ్యాడు. 2014లో 60 అడుగుల ఎత్తుతో షష్టి పూర్తి మహాత్సవం కూడా ఘనంగా నిర్వహించారు.
ఒక్క అడుగుతో ప్రారంభం..
హైదరాబాదులోని ఖైరతాబాద్ ప్రాంతంలో 1954లో 1 అడుగుల (0.30 మీ) ఎత్తైన గణేశుడి విగ్రహం స్థాపించబడింది. 1893లో బాలగంగాధర తిలక్ ఇచ్చిన పిలుపుతో స్ఫూర్తి పొందిన భారత స్వాతంత్ర్య ఉద్యమ కార్యకర్త, మాజీ కార్పొరేటర్ అయిన సింగరి శంకరయ్య ఈ పండుగను ఐక్యతకు గుర్తుగా జరుపుకోవాలని ప్రారంభించారు. ఏడాదికో అడుగు పెంచుకుంటూ 60 అడుగులకు పైగా విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ ఏడాది 70వ సంవత్సరం కావడంతో ఏకండా 70 అడుగు భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు.
ఖైరతాబాద్ గణేషుడు…. కొన్నాళ్ళు లడ్డూ నైవెద్యంలో కూడా అందరి దృష్టిని ఆకర్శించాడు. అయితే లడ్డూ పంపిణిలో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో… ఆ ఆచారాన్ని నిలిపివేశారు. ఖైరతాబాద్ గణేష్ చేతిలో కేవలం బొమ్మ లడ్డు మాత్రమే ఉంటుంది. ఖైరతాబాద్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో 55 అడుగుల జంజం, 50 అడుగుల కండువా సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.