శుక్రవారం అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు.. అందుకే ఈరోజున అమ్మవారికి భక్తితో పూజిస్తారు.. శుక్రవారం రోజు లక్ష్మిదేవికి ఇష్టమైన పువ్వులు, నైవేద్యాలను సమర్పించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు.. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అమ్మవారికి శుక్రవారం అంటే ఎందుకు ఇష్టం.. దాని వెనుక ఏదైనా పెద్ద కథ ఉందేమో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
రాక్షసులందరికీ శుక్రాచార్యుడు అనే గురువు ఉండేవాడట.. ఆ రాక్షసుల గురువు అయినా శుక్రాచార్యుడి పేరు మీదుగానే ఈ శుక్రవారం అనే పేరు కూడా వచ్చిందట. కాగా శుక్రాచార్యుడి తండ్రి మరెవరో కాదు బృగు మహర్షి. భృగుమహర్షిని బ్రహ్మదేవుడి సంతానంలో ఒకరిగా చెబుతుంటారు. ఆ విధంగా లక్ష్మీదేవికి శుక్రాచార్యుడు సోదరుడు అవుతాడు. అందుకే లక్ష్మీదేవికి శుక్రవారం అంటే ప్రీతికరం అని పురాణాలు చెబుతున్నాయి.. ఆ రోజున అందరు అలా పూజలు మొదలు పెట్టారని చెబుతున్నారు..
అలా ఆరోజు అమ్మవారికి అంకితం..ప్రీతికరమైన శుక్రవారం రోజున అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల ఆర్థిక సమస్యలు దూరం అవ్వడంతో పాటుగా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. ముఖ్యంగా లక్ష్మీదేవిని పూజించేవారు శుక్రవారం రోజున ధూమపానం మద్యపానం అలాగే మాంసాహారం వంటివి తీసుకోకూడదు. అలాగే తెలిసి, తెలియక కొన్ని పొరపాట్లు అసలు చెయ్యకూడదు.. అలా చేస్తే అమ్మకు కోపం వస్తుంది.. ఇది గుర్తుంచుకోండి..