సాధారణంగా మనకు తెలిసో తెలియకో భోజనం చెయ్యడం విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తారు.. ఆ పొరపాట్లే మనకు బాధ పడేలా చేస్తుంది..ఈరోజుల్లో టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో ప్రతి ఒక్కరి ఇంట్లో డైనింగ్ టేబుల్ లు సోఫాలు మంచాలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో కింద నేలపై కూర్చుని భోజనం చేసేవారి సంఖ్య చాలా వరకు తగ్గిపోయింది. కేవలం పల్లెటూర్లలో మాత్రమే ఇలా కింద కూర్చుని భోజనం చేస్తున్నారు.
అయితే పట్టణాల్లో చాలావరకు మంచాల పైన డైనింగ్ టేబుల్ పైన కూర్చుని కాళ్లు ఊపుతూ కదుపుతూ తింటూ ఉంటారు. ఎక్కువ మంది చేసే పొరపాటు ఇదే.. మంచంపై కూర్చుని భోజనం చేయడం.. చిన్నపిల్లలకు అయితే మంచంపై కూర్చోబెట్టుకుని లేదా ఒళ్ళో కూర్చోబెట్టుకుని భోజనం తినిపిస్తూ ఉంటారు. కానీ పెద్దవారు కూడా మంచంపై కూర్చుని భోజనం పెట్టుకుని ఉంటారు. కానీ పూర్వం మన పెద్దలు అలా మంచంపై కూర్చుని భోజనం చేయకూడదని చెప్పేవారు. కానీ మంచం పైన కూర్చుని భోజనం చేస్తే తిన్నది మంచం కోళ్లకు పడుతుందని పూర్వికులు అంటుంటారు., అంతేకాదు అలా కూర్చొని తినడం వల్ల ఎన్నో రోగాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు..
ఇంట్లో చికాకులు కలుగుతాయి.. భార్య భర్తల బంధం దెబ్బ తింటుంది..భార్యాభర్తల మధ్య గొడవలకు దారి తీస్తుందట. కుటుంబంలో మనశ్శాంతి కరవైపోతుందట. అనవసరంగా చిన్న చిన్న విషయాలకే లేనిపోని గొడవలు మనస్పర్ధలు వస్తూ ఉంటాయట. అందుకే భోజనం చేసేటపుడు భగవంతుడిని ప్రార్థించాలి. ఎందుకంటే మన దేహమే దేవాలయం. మన ఆత్మ భగవత్ స్వరూపం అని పురాణాల్లో చెప్పబడింది. కనుక ఆ దేహానికి శాంతి చేకూరడానికి తినేటప్పుడు ఖచ్చితంగా ఒక పద్ధతిలో భోజనం చేస్తే మంచిదని శాస్త్రీయ నిపుణులు చెబుతున్నారు.. నేల మీద కూర్చొని తీసుకోవడం వల్ల చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.. ఇది ఫాలో అవ్వండి..