NTV Telugu Site icon

Immersion of Ganesh idol : వినాయకుని విగ్రహాలు ఎందుకు నిమజ్జనం చేస్తారో తెలుసా..?

Untitled 17

Untitled 17

Devotion: హిందువులు జరుపుకునే పండగల్లో వినాయకచవితి ఒకటి. భాద్రపదమాసం శుక్ల పక్షంలో వచ్చే చవితి తిధి, హస్త నక్షత్రం రోజున మధ్యాహ్న శుభ సమయంలో చవితి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. అయితే ఎవరి శక్తి తగట్టు వాళ్ళు ఒకరోజు, 3 రోజులు, 5 రోజులు, 9 రోజులు, 11 రోజులు ఈ వినాయక చవితి ఉత్సవాలు జరుపుకుంటారు. మొదటి రోజు వినాయక ప్రతిమని మండపంలో ప్రతిష్టించడంతో ప్రారంభమైన పండుగ వినాయకుని ప్రతిమని నిమజ్జనం చేయడంతో ముగుస్తుంది. అయితే వినాయకుని ప్రతిమలని ఎందుకు నిమజ్జనం చేస్తారు అనే సందేహం ఎప్పుడైనా కలిగిందా..? అయితే ఎందుకు నిమజ్జనం చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

Read also:Khairatabad-Balapur Ganesh Live Updates: ఖైరతాబాద్‌-బాలాపూర్‌ నిమజ్జన అప్డేట్‌

సాధారణంగా వినాయకచవితి భాద్రపదమాసంలో అంటే వర్షాకాలంలో వస్తుంది. ఇలా వర్షాకాలంలో జరుపుకోవడం వెనుక చాల కారణాలు ఉన్నాయి. వర్షాకాలంలో వానలు ఎక్కువగా కురవడం వల్ల నదులు, కాలువలు, పొంగి పొరలుతుంటాయి. ఇలా నీరు ఉద్రికతతో ప్రవహించడం వల్ల భూక్షయం ఏర్పడుతుంది. అంటే సారవంతమైన మట్టి కొట్టుకు పోతుంది. వినాయకుని ప్రతిమలని నిమజ్జనం చేయడం వల్ల సారవంతమైన మట్టి తిరిగి నదుల్లో కాలువల్లో చేరుతుంది. అలానే వినాయకుని ప్రతిమని ఆకులతో మరియు పువ్వులతో పసుపు కుంకాలతో పూజించి వినాయకునితో పాటు నీటిలో కలుపుతారు.

Read also:Share Market Opening: వారం తర్వాత కోలుకున్న మార్కెట్.. లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్

అలా వినాయకుణ్ణి పూజచే ఆకులు ఆయుర్వేద గుణాలను ఆకలిగి ఉంటాయి. ఇవి నీటిలో కలపడం వల్ల నీటిలోని సూక్ష్మ క్రిములు నశించి నీరు స్వచంగా మారుతుంది. ఈ నీరు తాగడం వల్ల అనారోగ్య సమస్యలు రాకుండావుంటాయి. అలానే వర్షాకాలంలో మనుషుల్లో వ్యాధినిరోధక శక్తి తగ్గుతుంది. దీనితో జలుబు, దగ్గు, జ్వరం వంటి అనేక వ్యాధులు వచే అవకాశం ఉంది. అలానే జీర్ణ శక్తి కూడా తగ్గుతుంది. అందుకే ఈ పండుగ రోజుల్లో ఎక్కువగ ఆవిరిపైన ఉడికించిన పౌష్ఠిక విలువులున్న ఆహార పదార్ధాలు నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా తీసుకుంటాము. దీనివల్ల మనలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. అలానే ఆవిరిపైన ఉడికిన పదార్ధాలు త్వరగా జీర్ణం అవుతాయి. ఇలా జీర్వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.

Show comments