Astrology Predictions : డిసెంబర్ 2026 గ్రహ సంచారాలు.. ఈ ఐదు రాశులకు పట్టిందల్లా బంగారమే
- డిసెంబర్లో కీలక గ్రహ మార్పులు
- వృషభ, మీన రాశులకు కలిసొచ్చే కాలం
- తుల, కుంభ రాశులకు ఆదాయ వృద్ధి
- మకర రాశికి సమస్యల నుంచి ఉపశమనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2026 డిసెంబర్ నెలలో కీలకమైన గ్రహ మార్పులు జరగబోతున్నాయి. ఏడాది చివరి నెలలో శని మీనరాశిలోకి చేరుతుండగా, గురు గ్రహం వక్ర మార్గంలో పయనించడం మొదలుపెడుతుంది. వీటితో పాటు సూర్యుడు, బుధుడు, శుక్రుడు, రాహువు, కేతువు కూడా తమ స్థానాలను మార్చుకుంటాయి. ఈ మార్పులు 12 రాశులపై ఏదో ఒక రకంగా ప్రభావం చూపినప్పటికీ, ఐదు రాశుల వారికి మాత్రం విశేషమైన యోగాలు కలిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతి, కొత్త అవకాశాలు, వ్యాపారంలో పురోగతి, ఆర్థికంగా బలపడటం వంటి సానుకూల మార్పులు కనిపించవచ్చు.
డిసెంబర్ 2026లో కీలక గ్రహ సంచారాలు
ఈ నెలలో గ్రహాల కదలికలు వరుసగా సాగుతాయి. డిసెంబర్ 2న బుధుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించి, డిసెంబర్ 4న అనురాధ నక్షత్రంలోకి అడుగుపెడతాడు. డిసెంబర్ 5న రాహువు మకర రాశిలోకి, కేతువు కర్కాటక రాశిలోకి మారుతాయి. డిసెంబర్ 11న శని మీన రాశిలో తిరోగమనం నుంచి బయటపడతాడు. ఆ తర్వాత డిసెంబర్ 13న గురుడు సింహ రాశిలో వక్రగతిలోకి వెళ్తాడు. డిసెంబర్ 16న సూర్యుడు ధనుస్సు రాశిలోకి, డిసెంబర్ 22న బుధుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తారు. ఈ సమయంలో శుక్రుడు తులారాశిలోనే కొనసాగుతుండగా, కుజుడు సింహ రాశిలో సంచరిస్తాడు.
Also Read
- Koti Deepotsavam 2026 Day 6: కార్తీక శుద్ధ దశమి.. కోటి దీపోత్సవంలో నేటి విశేష కార్యక్రమాలు ఇవే..!
- Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో శ్వేతార్క గణపతి కల్యాణం.. భక్తులతో కిక్కిరిసిన ఎన్టీఆర్ స్టేడియం
- Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో నేడు విశేష ఘట్టం.. శ్వేతార్క గణపతి కల్యాణం
- Koti Deepotsavam 2026: వైభవంగా కోటి దీపోత్సవం.. ఐదో రోజు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇవే..
వృషభ రాశి: నిలిచిన పనులకు ఊపు
వృషభ రాశి వారికి డిసెంబర్ నెల సానుకూల ఫలితాలను ఇస్తుంది. అదృష్టం కలిసి రావడంతో గతంలో ఆగిపోయిన పనులు, ప్రాజెక్టులను మళ్లీ పట్టాలెక్కించగలుగుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. తల్లిదండ్రులు, గురువుల అండతో లక్ష్యాలను చేరుకోవడం సులభమవుతుంది. వ్యాపారవేత్తలు పని మీద వివిధ ప్రాంతాలకు తిరిగే అవకాశం ఉంది, దీనివల్ల మంచి లాభాలు వస్తాయి. ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది.
మీన రాశి: కెరీర్లో ముందడుగు
మీన రాశి వారికి ఈ నెల చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది. అదృష్టం తోడుండటంతో జీవితంలోని పలు రంగాల్లో విజయాలు దక్కుతాయి. చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి కావడంతో పాటు, రావాల్సిన డబ్బు కూడా చేతికి అందవచ్చు. ఉద్యోగులకు ప్రతిభ, అర్హతలకు తగ్గట్టు ప్రమోషన్ లేదా జీతం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. దశమ స్థానంలో సూర్యుని సంచారం వల్ల ఉద్యోగ, వ్యాపారాల్లో పెద్ద లాభాలు కనిపించవచ్చు. విదేశాలకు సంబంధించిన వ్యవహారాల్లోనూ కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి.
కుంభ రాశి: ఆదాయం, గౌరవంలో వృద్ధి
ఏడాది చివరి నెల కుంభ రాశి వారికి అనుకూల వాతావరణాన్ని తెస్తుంది. సంపాదన పెంచుకునేందుకు కొత్త మార్గాలు కనిపిస్తాయి. సమాజంలో మీ మాటకు, గౌరవానికి విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది, ఆగిపోయిన పనులు తిరిగి మొదలవుతాయి. వ్యాపారస్తులకు కొత్త కాంట్రాక్టులు దక్కి ఆర్థికంగా లాభపడతారు. పోటీ పరీక్షలు రాసే వారికి కూడా విజయావకాశాలు మెండుగా ఉన్నాయి.
తులారాశి: ఆర్థికంగా బలోపేతం
వృత్తి, ఆర్థిక విషయాల్లో తులారాశి వారికి డిసెంబర్ నెల బాగా కలిసి వస్తుంది. గురు గ్రహ ప్రభావంతో ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగ రంగంలో మీ పనికి గుర్తింపు, ప్రశంసలు లభించి పదోన్నతి లేదా బోనస్ వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యాపారాన్ని విస్తరించడానికి, కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి ఇది మంచి సమయం. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడటంతో పాటు కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. కుటుంబ, వైవాహిక జీవితం ప్రశాంతంగా సాగుతుంది.
మకర రాశి: దీర్ఘకాలిక సమస్యలకు తెర
కర్కాటక రాశి ప్రభావంతో ఈ రాశి వారి జీవితాల్లో దీర్ఘకాలంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. గురు గ్రహం సంపద స్థానంలో ఉండటం వల్ల అనుకోని ఆర్థిక లాభాలు చేకూరతాయి. దీనివల్ల భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేసుకోగలుగుతారు. ఉద్యోగులకు జీతం పెరగడంతో పాటు కొత్త బాధ్యతలు అప్పగించవచ్చు. పాత పెట్టుబడుల నుంచి కూడా ఆశించిన రాబడి వస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు, భాగస్వామితో కలిసి ట్రిప్ ప్లాన్ చేసే అవకాశం ఉంది. కొత్త వ్యాపారం మొదలుపెట్టాలనుకునే వారికి ఈ నెల లాభదాయకంగా ఉంటుంది.
(గమనిక: ఇది జ్యోతిష్య అంచనాల ఆధారంగా ఇచ్చిన సమాచారం మాత్రమే. వీటికి శాస్త్రీయ నిర్ధారణ లేదు.)
తాజావార్తలు
-
Astrology Predictions : డిసెంబర్ 2026 గ్రహ సంచారాలు.. ఈ ఐదు రాశులకు పట్టిందల్లా బంగారమే
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
Jailer 2 : బాక్సాఫీస్ వద్ద ‘జైలర్ 2’ ఊచకోత.. కానీ ఆ రెండు రికార్డులు మిస్
-
Nifty 50: పరుగులు పెడుతున్న నిఫ్టీ 50.. 52 వారాల గరిష్టానికి చేరుతుందా..?
-
Hindu Population: హిందూ జనాభాలో అగ్రస్థానం.. ముస్లిం జనాభాలో రెండో స్థానం.. 2070 నాటి ప్రపంచంలో భారత్లో పరిస్థితి!
ట్రెండింగ్
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!