Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!

Wednesday Horoscope

Wednesday Horoscope

Wednesday Horoscope October 14 2026: వృషభ రాశి వారికి కుటుంబ ఆదాయ మార్గాలు పెరుగుతాయి. రైతులకు తగిన సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు చదువులో మంచి అభివృద్ధి సాధిస్తారు. ఈ రాశి వారు శుభాల కోసం మహాదేవి అమ్మవారి జగద్ధాత్రి స్తోత్రం పారాయణం చేయాలి. తులా రాశి వారు ఈ రోజు నూతన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు చేయవలసి రావచ్చు, అలాగే కళాత్మక కార్యక్రమాల నుండి ఆహ్వానాలు అందుతాయి. ఈ రాశి వారు మహాగౌరీ పూజ నిర్వహించి, అమ్మవారికి తాంబూలం సమర్పించడం ఎంతో మంచిది.

కుంభ రాశి వారు వ్యాపారంలో నూతన విధానాలను అవలంబించి ఆదాయ మార్గాలను పెంచుకుంటారు. స్నేహితులతో ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. వీరు శ్రీ లలితా అమ్మవారి సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. మీన రాశి వారికి సంగీత, సాహిత్య రంగాలలో మంచి ప్రశంసలు దక్కుతాయి. ఆధ్యాత్మిక యాత్రలకు ప్రణాళికలు వేసుకుంటారు. మానసిక ఆందోళనలు తొలగిపోయి ప్రశాంతత చేకూరుతుంది. ఈ రాశి వారు కాత్యాయని అమ్మవారికి దుర్గా పూజ నిర్వహించడం ఎంతో మంచిది. కింది వీడియోలో మిగతా రాశుల దిన ఫలాలను ప్రముఖ జోతిష్య పండితులు శ్రీ రాయప్రోలు మల్లికార్జునశర్మ గారు అందించారు.