NTV Telugu Site icon

Koti Deepotsavam 2024: ‘కోటి దీపోత్సవం’ వేడుకకు సీఎం రేవంత్.. స్వామివారికి హారతి

Cm

Cm

భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘కోటి దీపోత్సవం’ వేడుకలు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నవంబర్‌ 9న ఆరంభమైన ఈ దీపాల పండుగ దిగ్వజయంగా కొనసాగుతోంది. హైదరాబాద్‌ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు కోటి దీపోత్సవ వేడుకకు చేరుకున్నారు. కాగా.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న రేవంత్.. ఉజ్జయిని మహాకాళేశ్వరుడికి హారతి సమర్పించారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

నేడు తిరువణ్ణామలై శ్రీ అరుణాచలేశ్వర స్వామి కల్యాణంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. అనంతరం వేదికపై స్వర్ణలింగానికి రజత బిల్వార్చన, అష్టోత్తరశత స్వర్ణపుష్పార్చన జరిపారు. దీంతో పాటు పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ (అవధూత దత్తపీఠం, మైసూరు) అనుగ్రహ భాషణం చేశారు. మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ డా. గరికిపాటి నరసింహారావు ప్రవచనామృతం వినిపించారు. భక్తులచే మహాకాళేశ్వరునికి కోటి పుష్పార్చన చేయించారు.  పల్లకీ వాహన సేవ ఘనంగా నిర్వహించారు.

ఆరవ రోజు విశేష కార్యక్రమాలు:
# పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ (అవధూత దత్తపీఠం, మైసూరు) గారిచే అనుగ్రహ భాషణం
# మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ డా. గరికిపాటి నరసింహారావు గారిచే ప్రవచనామృతం
# వేదికపై స్వర్ణలింగానికి రజత బిల్వార్చన, అష్టోత్తరశత స్వర్ణపుష్పార్చన
# భక్తులచే మహాకాళేశ్వరునికి కోటి పుష్పార్చన
# అగ్నిలింగ క్షేత్రం తిరువణ్ణామలై శ్రీ అరుణాచలేశ్వర స్వామి కల్యాణం
# పల్లకీ వాహన సేవ