Koti Deepotsavam 2026: నవంబర్ 14 నుంచి హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ‘కోటి దీపోత్సవం’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహా నగరపు ఉరుకులు పరుగుల జీవితంలో ఒక్కసారిగా ప్రశాంతత.. ట్రాఫిక్ చప్పుళ్ల మధ్య చెవులకింపుగా వినిపించే శివ పంచాక్షరీ మంత్రం! అవును, భాగ్యనగరం మరోసారి భక్తి పారవశ్యంలో మునిగితేలడానికి సిద్ధమైంది. సనాతన ధర్మ వైభవానికి, తెలుగు వారి ఆధ్యాత్మికతకు సజీవ సాక్ష్యంగా నిలిచే భక్తి టీవీ ‘కోటి దీపోత్సవం – 2026’కు కౌంట్ డౌన్ మొదలైంది. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఎన్టీఆర్ స్టేడియం కేవలం ఆటలకే కాదు, శివనామ స్మరణతో మార్మోగేందుకు ముస్తాబవుతోంది. నవంబర్ 14వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ సువిశాల మైదానం సాక్షాత్తూ కైలాసాన్ని తలపించనుంది. ఒకేచోట వేలాది మంది భక్తులు చేరి, ఒకేసారి వెలిగించే కోటి దీపాల వెలుగులు ఈ మహా నగరపు ఆకాశాన్ని దేదీప్యమానంగా ప్రకాశింపజేయనున్నాయి. కార్తీక మాసపు చలి రేయిలో ఆ దీపాల వెచ్చదనం భక్తుల మనసుల్లోని అజ్ఞానపు చీకట్లను పారద్రోలి, ఆధ్యాత్మిక జ్యోతులను వెలిగించనుంది.
ఈ ఏడాది కోటి దీపోత్సవం మునుపెన్నడూ లేని విధంగా అత్యంత గరంగ వైభవంగా జరగనుంది. కేవలం దీపాలు వెలిగించడానికే పరిమితం కాకుండా, ప్రతిరోజూ దేశ నలుమూలల నుంచి వచ్చే ప్రముఖ పీఠాధిపతులు, ప్రఖ్యాత ఆధ్యాత్మిక వేత్తల ప్రవచనాలతో ఈ ప్రాంగణం మార్మోగనుంది. శివపార్వతుల కల్యాణాలు, దివ్య దర్శనాలు, మనసుకు హత్తుకునే వేద మంత్రోచ్ఛారణలు భక్తులను అక్షరాలా మరో లోకంలో విహరించేలా చేయనున్నాయి. ఎన్టీఆర్ స్టేడియంలో భక్తులందరూ అత్యంత సౌకర్యవంతంగా కూర్చుని ఈ దివ్య క్రతువును వీక్షించేలా, అణువణువునా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ అపురూపమైన కార్తీక మాసంలో, ఆ పరమశివుడిని ఇంత దగ్గరగా, ఇంతలా ఆరాధించే అవకాశం రావడం నిజంగా తెలుగు ప్రజల అదృష్టం. నవంబర్ 14 నుంచి 30 వరకు.. ఆ కోటి దీపాల సాక్షిగా సాగే ఈ భక్తి యజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై, ఆ జన్మజన్మల పుణ్యఫలాన్ని మూటగట్టుకుందాం! ఆ మహాశివుడి కృపాకటాక్షాలకు పాత్రులవుదాం!
Also Read
- Govardhan Puja 2026: నేడే గోవర్ధన పూజ.. శుభ సమయం, పూజా విధానం, మంత్రాలు, హారతి వివరాలు ఇవే!
- Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు అత్యంత జాగ్రత్త.. మీరున్నారో చూసుకోండి!
- Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
- Diwali Horoscope 2026: దీపావళి రోజు దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు!
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026: నవంబర్ 14 నుంచి హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ‘కోటి దీపోత్సవం’
-
Sonia Gandhi: సోనియా ప్రధాని కాకపోవడానికి కారణం వాళ్లే.. సంచలన విషయాలు వెలుగులోకి..
-
Mumbai Police High Alert: గ్యాంగ్స్టర్ల టార్గెట్‌లో బాలీవుడ్ స్టార్స్..! సినీ నటులకు పోలీసుల వార్నింగ్.. వాటి జోలికి వెళ్లకండి..!
-
Nayanthara: క్రేజ్ ఉంది.. కానీ కలెక్షన్లు లేవు.! బాక్సాఫీస్ వద్ద నయనతారకు వరుస షాక్‌లు..
-
NCP: విలీనం దిశగా ఎన్సీపీ!?
ట్రెండింగ్
-
Jio Recharge: Buy 1 Get 1 ఆఫర్ తో ఈ రెండు ప్లాన్లపై డబుల్ బెనిఫిట్స్..!
-
BSNL నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. రూ.172, రూ.184, రూ.190లకే అన్లిమిటెడ్ కాలింగ్..!
-
గేర్లు మార్చాల్సిన అవసరం లేకుండానే సులువుగా రైడ్.. KTM 390 Super Duke GT Evo బైక్ లాంచ్‌కు సిద్ధం..!
-
IND vs NZ 3rd ODI: వర్షం మధ్యే టాస్.. న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన భారత్.! 40 ఓవర్లకు కుదింపు..
-
IPL 2027: అతడిని ఆల్‌రౌండర్‌గా అస్సలు అంగీకరించను.. భారత జట్టులో ఎలా అవకాశం వచ్చిందో?