NTV Telugu Site icon

Koti Deepotsavam 2022: భక్తి టీవీ కోటి దీపోత్సవం.. 14వ రోజు కార్యక్రమాలివే!

Kotinov10

Kotinov10

అక్టోబర్ 31వ తేదీన ప్రారంభం అయిన భక్తి టీవీ కోటిదీపోత్సవం ప్రతి రోజూ వినూత్న ఆధ్యాత్మిక కార్యక్రమాలతో భక్తుల ప్రశంసలు అందుకుంటోంది. ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీల సంయుక్త ఆధ్వర్యంలో భక్తి టీవీ కోటిదీపోత్సవం కనుల పండువగా సాగుతోంది. వేలాదిమంది భక్తులు ఈ కోటిదీపోత్సవాన్ని కనులారా వీక్షించి తరిస్తున్నారు. భాగ్యనగరం భక్తి టీవీ కోటిదీపోత్సవ వేడుకతో అలరారుతోంది.

Koti Janam

సాయంత్రం అయిందంటే చాలు చలిని కూడా లెక్కచేయకుండా భక్తులు ఎన్టీఆర్ స్టేడియం వైపు పరుగులు తీస్తున్నారు. అక్టోబర్ 31న ప్రారంభం అయిన కోటి దీపోత్సవ సంరంభం 14వ రోజుకి చేరుకుంది. నవంబర్ 14 సోమవారంతో కోటి దీపోత్సవం ముగియనుంది. కోటిదీపోత్సవం-2022లో పల్లకీ సేవలు, ప్రవచనాలు, అనుగ్రహ భాషణలు, సప్త హారతి, కల్యాణోత్సవాలు, కుంకుమార్చనలు, దీపోత్సవాలతో ఆధ్యాత్మిక అనుభవాన్ని అందించింది.

కోటి దీపోత్సవం 14వ రోజు కార్యక్రమాలివే

కార్తిక ఆదివారం కోటి దీపోత్సవ వేదికపై మొట్టమొదటిసారిగా శ్రీపురం నారాయణి పీఠం స్వర్ణదేవాలయ పీఠాధిపతి శ్రీ శక్తి అమ్మవారి ఆశీర్వచనం వుంటుంది,
శ్రీశక్తి అమ్మ స్వామీజీ శ్రీపురం నారాయణి పీఠంవారి అనుగ్రహ భాషణం అందిస్తారు
బ్రహ్మ శ్రీ కుప్పా విశ్వనాథ శర్మ ప్రవచనామృతం వుంటుంది
వేదికపై గోవిందనామస్మరణ పూజ, భక్తులచే కూడా గోవిందనామస్మరణ ఉంటుంది
భక్తుల కోరిక మేరకు కోటి దీపోత్సవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణం వైభవంగా నిర్వహిస్తారు. పల్లకీ సేవ నేత్రానందం కలిగిస్తుంది. సప్తహారతులు కనులారా తిలకించాల్సిందే. లింగోద్భవం చూడాల్సిందే.

Show comments