అంగరంగ వైభవంగా తిరుమల శ్రీవేంకటేశ్వరుని కల్యాణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న భక్తిటీవీ కోటి దీపోత్సవం కార్యక్రమం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తోంది. కన్నుల పండువగా జరుగుతున్న ఈ కార్యక్రమం ఇవాళ్టికి 10వ రోజుకు చేరింది. ఆదివారం కావడంతో ఈరోజు జరిగిన కోటి దీపోత్సవానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈరోజు కోటి దీపోత్సవానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు వేదపండితులు ఆశీర్వచనాలు అందజేశారు.

అనంతరం బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారి ఆధ్వర్యంలో ప్రవచనామృతం జరిగింది. ఆ తర్వాత ఏడు కొండల్లో కొలువుదీరిన కోనేటి రాయుడు తిరుమల శ్రీనివాస కల్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఈ కల్యాణ మహోత్సవాన్ని కోటి దీపోత్సవం వేదికపై వేదమంత్రోచ్ఛరణల నడుమ వేదపండితులు ఘనంగా జరిపించారు. గోవింద నామ స్మరణలతో ఎంతో కన్నుల పండువగా జరిగిన శ్రీనివాసుడి కల్యాణం చూసేందుకు రెండు కళ్లు సరిపోలేదంటే అతిశయోక్తి కాదు. అనంతరం స్వామి వార్ల పల్లకిని కోటి దీపోత్సవ వేదిక ప్రాంగంణం చుట్టూ ఊరేగించారు.
Also Read
- Angkor Wat: ప్రపంచంలో అతి పెద్ద గుడి ఏది.? ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే.!
- Thursday Horoscope: ఆ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సిందే.. లేదా తిప్పలు తప్పవ్..!
- Chanakya Niti: ఓర్వలేని చుట్టాలకు చెక్ పెట్టే చాణక్య నీతి.. రాబంధువుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండిలా!
- Daily Horoscope: బుధవారం రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని శుభవార్తలు!

శ్రీనివాసుడి కల్యాణం అనంతరం విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్రస్వామి గారి అనుగ్రహభాషణం, ఉత్తరాధికారి శ్రీస్వాత్మానందేంద్ర సరస్వతి ఆశీర్వచనం జరిగాయి. అనంతరం కోటి దీపోత్సవానికి తరలివచ్చిన భక్తజనం కోటి దీపార్చన నిర్వహించారు.

ఇక కోటి దీపోత్సవం కార్యక్రమంలో లింగోద్భవ ఘట్టం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బంగారు లింగోద్భవం సన్నివేశాన్ని కన్నులారా చూసి తరించడమే తప్ప మాటల్లో చెప్పడం వీలుకాదు. అనంతరం నిర్వహించిన సప్తహారతి ఈ కార్యక్రమానికి మరింత శోభను తీసుకువచ్చింది. మంగళవాయిద్యాలు, నృత్యాలతో శోభయమానంగా మారింది. చిన్నాపెద్దా తేడా లేకుండా భక్తితో కార్తీకమాసాన కోటి దీపోత్సవ వేడుకల్లో పాల్గొని పునీతులయ్యారనే చెప్పాలి.







తాజావార్తలు
-
Trigun: ప్రధాని మాటే మా సినిమాకు బలం.. ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ టీమ్!
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
Marksheet Cake: ముంబై టు సోషల్ మీడియా.. నెట్టింట వైరల్ అవుతున్న ‘మార్క్షీట్’ సెలబ్రేషన్!
-
LayOffs: మరో దిగ్గజ కంపెనీలో భారీగా లే ఆఫ్స్.. 4000 మంది ఉద్యోగుల తొలగింపు..
-
UAE-Iran: యూఏఈలో నెతన్యాహూ పర్యటన.. ఇరాన్ తీవ్ర ఆగ్రహం..
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?