Site icon NTV Telugu

169 కి.మీ రేంజ్‌, 6.7kW పీక్ పవర్తో ఈవీ మార్కెట్లో అడుగుపెట్టిన Yamaha EC-063

Yamaha

Yamaha

Yamaha EC-06: భారత్‌ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌లోకి Yamaha అధికారికంగా అడుగు పెట్టింది. కంపెనీ తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ Yamaha EC-06ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ స్కూటర్ ధరను రూ.1,67,600 (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది. అయితే, ప్రారంభ దశలో ఈ స్కూటర్‌ను ఎంపిక చేసిన నగరాల్లోని Yamaha ప్రీమియం బ్లూ స్క్వేర్ షోరూమ్‌ల ద్వారా మాత్రమే విక్రయించనున్నారు. ఇది యమహా ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రయాణంలో ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని సంస్థ పేర్కొంది. ఈ స్కూటర్ River Indie ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకుని రూపొందించబడింది.

Read Also: Tvk Vijay : వెనక్కి తగ్గిన జననాయగన్ మేకర్స్.. మరోసారి సెన్సార్

బ్యాటరీ:
* Yamaha EC-06లో అంతర్గత శాశ్వత అయస్కాంత సమకాలిక మోటార్ (IPMSM)ను ఉపయోగించారు. దీంతో పాటు 4kWh ఫిక్స్‌డ్ బ్యాటరీ అందించారు. అయితే, సాధారణ ఇంటి ప్లగ్‌తోనే ఛార్జింగ్ సౌకర్యం ఉండగా, పూర్తి ఛార్జ్ కావడానికి సుమారు 8 గంటల సమయం పడుతుంది. ఒక్కసారి పూర్తి ఛార్జ్‌తో ఈ స్కూటర్ 169 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అందిస్తుంది. ఇది రోజువారీ నగర ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది.

* 6.7kW పీక్ పవర్
* 26Nm టార్క్
* 79 కిలోమీటర్ల గరిష్ట వేగం

డిజైన్ & హార్డ్‌వేర్:
* ప్రారంభంలో Yamaha EC-06ను ఒకే ఒక Bluish White రంగులో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ స్కూటర్‌ను భారత్‌లోనే డిజైన్ చేసినప్పటికీ, గ్లోబల్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి చేసినట్లు యమహా తెలిపింది. స్టైలిష్, ప్రాక్టికల్ అండ్ పర్యావరణహితమైన కమ్యూటింగ్ కోసం ఇది రూపొందించబడింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండింటికీ 200 మిల్లిమీటర్ల డిస్క్ బ్రేకులు అందించారు. అదనంగా Combi Brake System (CBS) ద్వారా సురక్షితమైన బ్రేకింగ్ అందుతుంది. ఇక, ఈ స్కూటర్‌లో LED హెడ్‌లైట్స్, టెయిల్‌లైట్స్ ఉండటం వల్ల రాత్రి సమయంలో మెరుగైన విజిబిలిటీతో పాటు ప్రీమియం లుక్‌ను అందజేస్తాయి.

Read Also: Healthy Breakfast : వంట చేసే టైమ్ లేదా? రాత్రి ఈ 4 వస్తువులు నానబెడితే చాలు.. ఉదయానికి అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్ రెడీ!

Yamaha EC-06: ఫీచర్లు:
* వివిధ రైడింగ్ అవసరాలకు అనుగుణంగా ఈ స్కూటర్‌లో మూడు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. ఇవి సమర్థవంతమైన రేంజ్, సమతుల్య పనితీరు లేదా వేగవంతమైన యాక్సిలరేషన్‌ను ఎంపిక చేసుకునే అవకాశాన్ని ఇస్తాయి. ఇరుకైన ప్రదేశాల్లో స్కూటర్‌ను తిప్పుకోవడానికి సహాయపడేలా Reverse Mode కూడా ఉంది. అలాగే, సస్పెన్షన్ విషయంలో, ముందు భాగంలో హైడ్రాలిక్ డ్యాంపర్లతో టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక భాగంలో కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అందించారు. అదనంగా, కలర్ LCD డిస్‌ప్లే ద్వారా స్పీడ్, బ్యాటరీ స్టేటస్, రైడింగ్ మోడ్‌లు, కనెక్టివిటీ వివరాలను చూడవచ్చు.

* Eco Mode
* Standard Mode
* Power Mode

ధర:
అయితే, భారత మార్కెట్లో Yamaha EC-06 ఎక్స్-షోరూమ్ ధర రూ.1,67,600గా ఉంది.

* River Indie
* Ather 450X
* Ola S1 Pro
* Suzuki e-Access వంటి ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోటీ పడనుంది. భారత్‌లో యమహా ఎలక్ట్రిక్ వాహనాల ప్రయాణం EC-06తో ప్రారంభం కావడంతో.. రానున్న రోజుల్లో మరిన్ని ఎలక్ట్రిక్ మోడళ్లకు తీసుకొచ్చేందుకు కంపెనీ రెడీ అవుతుందని ఆటో రంగ నిపుణులు భావిస్తున్నారు.

Exit mobile version