NTV Telugu Site icon

Lightyear 0: ప్రపంచంలోనే తొలి సోలార్ కార్..నడుస్తున్నప్పుడే ఛార్జింగ్.. రేంజ్ ఎంతో తెలుసా..?

Lightyear 0

Lightyear 0

World’s first solar car Light Year 0: ప్రపంచవ్యాప్తంగా కర్భన్ ఉద్గారాలను తగ్గించుకోవాలని అన్ని దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. దీంతో సంప్రదాయ పెట్రోల్, డిజిల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలు వస్తున్నాయి. ఇప్పటికే టెస్లా వంటి కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లతో పాటు ట్రక్కులను తీసుకువచ్చింది. రానున్న రోజుల్లో పూర్తిగా వాహనరంగాన్ని ఎలక్ట్రిక్ వాహనాలే ఏలే అవకాశం ఉంది. దీనికి తగ్గట్లుగానే అన్ని ఆటోమేకింగ్ కంపెనీలు తమ ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లో లాంచ్ చేస్తున్నాయి. ఇండియాలో టాటాతో పాటు మహీంద్రా, ఎంజీ, హ్యుందాయ్ వంటి ప్రసిద్ధ కార్ల తయారీ సంస్థలు తమ కార్లను మార్కెట్ లోకి తీసుకువచ్చాయి. ఎలక్ట్రిక్ కార్లలోనే కొత్త టెక్నాలజీని తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి.

Read Also: Sundar Pichai: గూగుల్ సీఈఓకి పద్మభూషణ్..

ఇదిలా ఉంటే లైట్‌ఇయర్ 0 అనే కంపెనీ కొత్తగా సోలార్ ఎలక్ట్రిక్ కార్ ను తీసుకురాబోతోంది. ఇది ప్రపంచంలోనే తొలి సోలార్ ఎలక్ట్రిక్ కారు. దీన్ని డ్రైవింగ్ చేస్తున్న సమయంలోనే ఛార్జింగ్ అవుతుంది. ఛార్జింగ్ అవసరం లేకుండా నెలల తరబడి ప్రయాణించే వీలుంటుంది. కారు రూఫ్, ఇతర భాగాల్లో అమర్చిన సోలార్ ఫ్యానెళ్ల సహాయంతో కార్ రీఛార్జ్ అవుతుంది. కారు ప్రయాణించే సమయంలో సూర్యుడి నుంచి వచ్చే శక్తిని ఆధారంగా చేసుకుని ఛార్జింగ్ చేసుకుంటుంది. ప్రతీ రోజు దాదాపుగా 43 మైళ్ల వరకు విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది ఈ కార్. రూఫ్ పై 50 చదరపు అడుగుల కంటే ఎక్కువ సోలార్ ఫ్యానెళ్లు ఉన్నాయి.

డచ్ స్టార్టప్ కంపెనీకి చెందిన ఎంట్రప్రెన్యూర్ మ్యాగజీన్ ప్రకారం లైట్‌ఇయర్ 0 కారు నాలుగు డోర్లు కలిగిన ఎలక్ట్రిక్ కారు. ప్రపంచంలోనే తొలి సోలార్ కారుగా రికార్డు సృష్టించనుంది. అనేక కార్ల తయారీ కంపెనీల కార్ల రేంజ్ పెంచేందుకు బ్యాటరీలను పెంచుకుంటూ పోతున్నాయి. అయితే లైట్‌ఇయర్ 0 మాత్రం ఇందుకు భిన్నంగా తక్కువ బ్యాటరీలను కలిగి సౌరశక్తితో ఛార్జింగ్ అయ్యేలా రూపకల్పన చేశారు. ఫిన్లాండ్ లో ఈ కార్ ఉత్పత్తి ప్రారంభం అయింది. 2023 చివరి నాటికి వారానికి 5 కార్ల చొప్పున విడుదల చేయాలని కంపెనీ భావిస్తోంది. కారు రీఛార్జ్ చేయడంతో ఆగకుండా దాదాపుగా 388 మైళ్లు( 624 కిలోమీటర్లు) రేంజ్ ఇస్తుంది. సోలార్ ప్యానెళ్ల నుంచి 43 మైళ్ల వరకు వస్తుంది. ప్రతీ గంటలకు ఆరు మైళ్ల చొప్పున ఛార్జ్ అవుతుంది.

Show comments