NTV Telugu Site icon

Volvo XC40: ఇండియన్ మార్కెట్ లోకి మరో ఎలక్ట్రిక్ ఎస్ యూ వీ

Olympus Digital Camera

Olympus Digital Camera

భారత మార్కెట్ లోకి మరో ఎలక్ట్రిక్ ఎస్ యూ వీ రాబోతోంది. స్వీడిష్ కార్ల దిగ్గజం వోల్వో తన మొదటి ఈవీ కార్ వచ్చే నెలలో ఇండియన్ మార్కెట్లోకి తీసుకురాబోతోంది. ఇప్పటికే పలు కంపెనీలు ఈవీ కార్ల తయారీపై కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్ లో టాటా నుంచి నెక్సాన్ ఈవీ, టిగోర్ ఈవీ ఉండగా, ఎంజీ నుంచి జెడ్ ఎస్ ఈవీ, హ్యుందాయ్ నుంచి కోనా ఉన్నాయి. త్వరలో మహీంద్రా నుంచి ఎక్స్ యూ వీ 3OO మార్కెట్లోకి రాబోతోంది.

దీంతో ఇతర కార్ల కంపెనీలు కూడా త్వరలోనే తమ ఎలక్ట్రిక్ వాహనాలను భారత మార్కెట్ లోకి ఇంట్రడ్యూస్ చేయబోతున్నాయి. తాజాగా వోల్వో ఎక్స్ సీ 40 రీఛార్జ్ కాంపాక్ట్ ఎస్ యూ వీని వచ్చే నెలలో మార్కెట్ లోకి తీసుకురాబోతోంది. వోల్వో కంపెనీ స్థానికంగా ఇండియాలోనే కార్ల అసెంబ్లింగ్ ను పూర్తి చేసింది. కర్ణాటక బెంగళూర్ సమీపంలోని హోస్కోటే లో 2017లో వోల్వో అసెంబ్లింగ్ యూనిట్ ను ప్రారంభించింది.

ప్రస్తుతం ఈ అసెంబ్లింగ్ యూనిట్ లో వోల్వో తన ఎస్ యూ వీ ఎక్స్ సీ 90, మిడ్ సైజ్ ఎస్ యూ వీ ఎక్స్ సీ 60, కాంపాక్ట్ లగ్జరీ ఎస్ యూ వీ ఎక్స్ సీ 40ని మార్కెట్ లోకి తీసుకురాబోతోంది. ఎక్స్ సీ 40 ప్యూర్ ఎలక్ట్రిక్ వెహికిల్. ఒకే ఛార్జ్ లో 418 కిలోమీటర్ల లాంగ్ రేంజ్ ను ఇస్తుంది. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న కార్లకు ధీటైన పోటీ ఇవ్వనుంది. భారతీయ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని అందుకు తగ్గట్లుగా ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తిని ప్రారంభించినట్లుగా వోల్వో ఇండియా తెలిపింది. ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్, డిజిల్ రేట్లను బట్టి వినియోగదారుడు ఈవీల వైపు ఆసక్తి చూపుతున్నాడు. రాబోయే కాలంలో ఈవీల వినియోగం మరింతగా పెరిగే అవకాశం ఉండటంతో టూవీలర్, ఫోర్ వీలర్ కంపెనీలు తమ ఈవీ వాహనాల ఉత్పత్తులపై దృష్టి పెడుతున్నాయి.