Volvo C40 Recharge: వోల్వో నుంచి ఎలక్ట్రిక్ కార్.. ఒక్క రీఛార్జ్‌తో 530 కి.మీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Volvo C40 Recharge: స్వీడన్ ఆటోమేకర్ వోల్వో తన కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ వోల్వో C40 రీఛార్జ్ కారును లాంచ్ చేసింది. ఇది ఈ కంపెనీ రెండో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అంతకుముందు వోల్వో నుంచి XC40 రీఛార్జ్ ఉంది. ఇండియా కార్ మార్కెట్ లో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతున్న నేపధ్యంలో అన్ని కార్ కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లపై దృష్టి సారించాయి. ఇందులో భాగంగానే వోల్వో తన రెండో ఎలక్ట్రిక్ కారును మార్కెట్ లో లాంచ్ చేసింది. C40 రీఛార్జ్ ధర రూ. 61.25 లక్షలుగా ఉంది. సెప్టెంబర్ 5 నుంచి ఈ కార్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. వోల్వో వెబ్‌సైట్ ద్వారా రూ. 1 లక్ష రీఫండబుల్ మొత్తానికి దీన్ని బుక్ చేసుకోవచ్చు. ఈ నెలలోపే కార్ డెలివరీలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
వోల్వో C40 రీఛార్జ్ కర్ణాటకలోని బెంగళూర్ హోస్కోట్ ఫ్లాంట్ లో అసెంబుల్ చేయబడుతోంది. స్థానికంగా అసెంబ్లింగ్ జరుగుతున్నప్పటికీ XC40 రీఛార్జ్ తో పోలిస్తే దీని ధర రూ. 4.35 లక్షలు ఎక్కువగా ఉంది. XC 40 రీఛార్జ్ ధర రూ. 56.90 లక్షలు(ఎక్స్ షోరూం)గా ఉంది. వోల్వో ఏడాదికొక ఎలక్ట్రిక్ వాహనాన్ని లాంచ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2030 నాటికి తన పోర్ట్‌ఫోలియోను పూర్తిగా విద్యుదీకరించాలని, 2040 నాటికి కార్బన్ న్యూట్రల్ గా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. మూడేళ్ల కార్ వారంటీ, మూడేళ్ల వోల్వో సర్వీస్ ప్యాకేజీ, మూడేళ్ల రోడ్ సైడ్ అసిస్టెన్స్, 8 ఏళ్లు లేదా 1.60 లక్షల కిలోమీటర్ల వరకు బ్యాటరీ వారంటీ, ఐదేళ్ల డిజిటల్ సబ్స్‌స్క్రిప్షన్ ఉంది.
Also Read
- Bajaj Pulsar N160 S N160 SS: బజాజ్ కొత్త పల్సర్ N160 S, N160 SS విడుదల.. 4-వాల్వ్ ఇంజన్, ధరలు, ఫీచర్లు ఇవే!
- Petrol Cars India: పెట్రోల్ కార్ల శకం ముగిసిందా? ఈవీలు, హైబ్రిడ్ కార్ల అమ్మకాలు రికార్డు స్థాయికి.. మార్కెట్లో మారుతి ఆధిపత్యం
- E3 Tryon: E3 ట్రయాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల.. 165KM రేంజ్, AI ఫీచర్లు.. ధర ఎంతంటే?
- రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
Read Also: Rahul Gandhi: ‘ఇండియా’, ‘భారత్’ పేరుపై రాహుల్ గాంధీ ఏమన్నారంటే..!
కాంపాక్ట్ మాడ్యులర్ ఆర్కిటెక్చర్ ప్లాట్‌ఫారంపై దీన్ని ఈ కార్ ని నిర్మించారు. ముందు వెనక రెండు పర్మినెంట్ మాగ్నటిక్ సింక్రోనస్ మోటార్లను కలిగి ఉంటుంది. 408 హెచ్‌పీ సామర్థ్యంతో 660 ఎన్ఎం టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. 78 kWh లిథియం-అయాన్ బ్యాటరీతో వస్తుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 4.7 సెకన్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఆల్ వీల్ డ్రైవ్ ఫీచర్ తో వస్తుంది.
11 కిలోవాట్ ఛార్జర్ తో C40 కారును 0-100 శాతం రీఛార్జ్ చేసేందుకు 7-8 గంటల సమయం పడుతుంది. 150kW DC ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగించి, ఎలక్ట్రిక్ SUVని సుమారు 27 నిమిషాల్లో 10-80% నుండి ఛార్జ్ చేయవచ్చు. రేంజ్ విషయానికి వస్తే ఒక్క ఫుల్ రీఛార్జ్ తో ఏకంగా 530 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది.
తాజావార్తలు
-
ISRO Recruitment: ఇంజనీరింగ్ అభ్యర్థులకు గోల్డెన్ ఛాన్స్.. ఇస్రోలో జాబ్స్‌కి నోటిఫికేషన్!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
Fazilka Border Drone Arms Smuggling: ఫాజిల్కా సరిహద్దు వద్ద పాకిస్థాన్ కుట్ర భగ్నం.. డ్రోన్, పిస్టల్, తూటాలు స్వాధీనం
-
Hollywood Box Office: ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ vs ‘ది ఒడిస్సీ’.. షేక్ అవుతున్న బాక్సాఫీస్.. కలెక్షన్స్ లో ఎవరిది పైచేయి?
-
Irumudi Trailer: భీమవరంలో రవితేజ హంగామా.. ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్ అక్కడే!
ట్రెండింగ్
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!