Site icon NTV Telugu

Volvo C40 Recharge: వోల్వో నుంచి ఎలక్ట్రిక్ కార్.. ఒక్క రీఛార్జ్‌తో 530 కి.మీ

Volvo C40 Recharge

Volvo C40 Recharge

Volvo C40 Recharge: స్వీడన్ ఆటోమేకర్ వోల్వో తన కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ వోల్వో C40 రీఛార్జ్ కారును లాంచ్ చేసింది. ఇది ఈ కంపెనీ రెండో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అంతకుముందు వోల్వో నుంచి XC40 రీఛార్జ్ ఉంది. ఇండియా కార్ మార్కెట్ లో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతున్న నేపధ్యంలో అన్ని కార్ కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లపై దృష్టి సారించాయి. ఇందులో భాగంగానే వోల్వో తన రెండో ఎలక్ట్రిక్ కారును మార్కెట్ లో లాంచ్ చేసింది. C40 రీఛార్జ్ ధర రూ. 61.25 లక్షలుగా ఉంది. సెప్టెంబర్ 5 నుంచి ఈ కార్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. వోల్వో వెబ్‌సైట్ ద్వారా రూ. 1 లక్ష రీఫండబుల్ మొత్తానికి దీన్ని బుక్ చేసుకోవచ్చు. ఈ నెలలోపే కార్ డెలివరీలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

వోల్వో C40 రీఛార్జ్ కర్ణాటకలోని బెంగళూర్ హోస్కోట్ ఫ్లాంట్ లో అసెంబుల్ చేయబడుతోంది. స్థానికంగా అసెంబ్లింగ్ జరుగుతున్నప్పటికీ XC40 రీఛార్జ్ తో పోలిస్తే దీని ధర రూ. 4.35 లక్షలు ఎక్కువగా ఉంది. XC 40 రీఛార్జ్ ధర రూ. 56.90 లక్షలు(ఎక్స్ షోరూం)గా ఉంది. వోల్వో ఏడాదికొక ఎలక్ట్రిక్ వాహనాన్ని లాంచ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2030 నాటికి తన పోర్ట్‌ఫోలియోను పూర్తిగా విద్యుదీకరించాలని, 2040 నాటికి కార్బన్ న్యూట్రల్ గా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. మూడేళ్ల కార్ వారంటీ, మూడేళ్ల వోల్వో సర్వీస్ ప్యాకేజీ, మూడేళ్ల రోడ్ సైడ్ అసిస్టెన్స్, 8 ఏళ్లు లేదా 1.60 లక్షల కిలోమీటర్ల వరకు బ్యాటరీ వారంటీ, ఐదేళ్ల డిజిటల్ సబ్స్‌స్క్రిప్షన్ ఉంది.

Read Also: Rahul Gandhi: ‘ఇండియా’, ‘భారత్‌’ పేరుపై రాహుల్ గాంధీ ఏమన్నారంటే..!

కాంపాక్ట్ మాడ్యులర్ ఆర్కిటెక్చర్ ప్లాట్‌ఫారంపై దీన్ని ఈ కార్ ని నిర్మించారు. ముందు వెనక రెండు పర్మినెంట్ మాగ్నటిక్ సింక్రోనస్ మోటార్లను కలిగి ఉంటుంది. 408 హెచ్‌పీ సామర్థ్యంతో 660 ఎన్ఎం టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. 78 kWh లిథియం-అయాన్ బ్యాటరీతో వస్తుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 4.7 సెకన్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఆల్ వీల్ డ్రైవ్ ఫీచర్ తో వస్తుంది.

11 కిలోవాట్ ఛార్జర్ తో C40 కారును 0-100 శాతం రీఛార్జ్ చేసేందుకు 7-8 గంటల సమయం పడుతుంది. 150kW DC ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగించి, ఎలక్ట్రిక్ SUVని సుమారు 27 నిమిషాల్లో 10-80% నుండి ఛార్జ్ చేయవచ్చు. రేంజ్ విషయానికి వస్తే ఒక్క ఫుల్ రీఛార్జ్ తో ఏకంగా 530 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది.

Exit mobile version