Upcoming SUV Launch 2023 in India: భారతీయ కార్ మార్కెట్‌లో మిడ్ సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌కు మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం ‘హ్యుందాయ్ క్రెటా’ ఈ సెగ్మెంట్‌లో అత్యధికంగా అమ్ముడవుతోన్న కారుగా ఉంది. గత కొన్ని నెలలుగా క్రెటా అమ్మకాలు స్థిరంగా ఉన్నాయి. అయితే త్వరలో క్రెటా క్రేజ్ తగ్గే అవకాశం ఉంది. ఏకంగా మూడు మిడ్-సైజ్ ఎస్‌యూవీలు మార్కెట్‌లోకి రానున్నాయి. హోండా, కియా మరియు సిట్రోయెన్ కంపెనీలు తమ సరికొత్త కార్లను తీసుకువస్తున్నాయి. విశేషమేమిటంటే రెండు కార్లు జూలైలోనే విడుదల కానున్నాయి.
Kia Seltos Facelift Launch:
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ వచ్చే నెలలో మార్కెట్‌లోకి రానుంది. ఇప్పటికే పలు డీలర్‌షిప్‌లలో ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీ కోసం అనధికారిక బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ ట్వీక్డ్ ఎక్స్‌టీరియర్ డిజైన్, పనోరమిక్ సన్‌రూఫ్, డ్యాష్‌బోర్డ్‌లో ట్విన్ డిస్‌ప్లే సెటప్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 360-డిగ్రీ కెమెరా, పవర్డ్ టెయిల్‌గేట్ లాంటి ఫీచర్లతో వస్తుంది. ఇందులో ఏడీఏఎస్ కూడా అందుబాటులో ఉంటుంది.
Also Read: Best Fruits For Kidney: రోజూ ఈ పండ్లను తింటే.. కిడ్నీ సంబంధిత వ్యాధులు అస్సలు రావు!
Honda Elevate Launch:
హోండా కంపెనీ ఇటీవలే క్రెటా మరియు గ్రాండ్ విటారాకు పోటీగా హోండా ఎలివేట్ మిడ్-సైజ్ ఎస్‌యూవీని పరిచయం చేసింది. ఈ మోడల్ వచ్చే నెలలో లాంచ్ కానుంది. ప్రస్తుతం కొన్ని డీలర్ల వద్ద ఏ కారు అనధికారిక బుకింగ్‌లు జరుగుతున్నాయి. హోండా ఎలివేట్ ఆరు-స్పీడ్ మాన్యువల్ యూనిట్ మరియు CVT యూనిట్‌తో జతచేయబడిన 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ని కలిగి ఉంటుంది. ఇందులో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ మరియు వైర్‌లెస్ ఛార్జర్ వంటి ఫీచర్లు ఉంటాయి.
Citroen C3 Aircross Launch:
సిట్రొయెన్ ఈ ఏడాది ఏప్రిల్‌లో C3 ఎయిర్‌క్రాస్‌ను భారత మార్కెట్ కోసం ఆవిష్కరించింది. C3 హ్యాచ్‌బ్యాక్ ఆధారంగా ఏడు సీట్ల ఎస్‌యూవీ ధరలను ఈ ఏడాది చివర్లో ప్రకటించే అవకాశం ఉంది. C3 ఎయిర్‌క్రాస్ 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది ఆరు-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ద్వారా మాత్రమే శక్తిని పంపుతుంది. ఈ మోటార్ పవర్ అవుట్‌పుట్ 109bhp కాగా.. టార్క్ 190Nm.