TVS Ronin Base+ Variant: TVS Ronin కొత్త Base+ వేరియంట్ లాంచ్.. తక్కువ ధరకే డ్యూయల్ ABS, అదనపు ఫీచర్లు
- TVS Roninలో కొత్త వేరియంట్
- Base+లో డ్యూయల్ ABS, టాప్ మోడల్లో ట్రాక్షన్ కంట్రోల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TVS Ronin Base+ Variant Launch: 2026 ఫెస్టివ్ సీజన్‌కు ముందు TVS Motor ప్రముఖ ప్రీమియం మోటార్‌సైకిల్ TVS Ronin లైనప్‌ను అప్డేట్ చేసింది. ఇందులో భాగంగా కొత్త Base+ వేరియంట్‌ను పరిచయం చేసింది. దీంతో పాటు మిడ్, టాప్ వేరియంట్లలోనూ అదనపు ఫీచర్లను జోడించింది. కొత్త TVS Ronin Base+ వేరియంట్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.1,42,490గా నిర్ణయించారు. మిడ్ వేరియంట్ ధర రూ.1,51,540, టాప్ వేరియంట్ ధర రూ.1,63,640గా ఉంది.
కొత్త Base+ వేరియంట్లో డ్యూయల్-ఛానల్ ABS
కొత్త Base+ వేరియంట్లో ప్రధాన ఆకర్షణ డ్యూయల్-ఛానల్ ABS. తక్కువ ధరలోనే ఈ ఫీచర్‌ను అందించడం ద్వారా Ronin లైనప్‌లో ఇది కీలక వేరియంట్‌గా నిలిచింది. ఈ వేరియంట్‌ను రెండు కొత్త కలర్ ఆప్షన్లలో అందిస్తున్నారు. అవి Sunlit Yellow, Desert Mirage.
Also Read
- Simple Wave Electric Scooter: సింపుల్ వేవ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫుల్ ఛార్జ్‌తో 243KM రేంజ్.. ధర ఎంతంటే?
- BYD Denza India Launch: భారత్‌లోకి మరో లగ్జరీ కార్ బ్రాండ్.. లగ్జరీ కార్ల మార్కెట్లో కొత్త సంచలనం..
- Volvo XC40, EX40, EC40 Updated: వోల్వో XC40, EX40, EC40 కొత్త వెర్షన్లు.. రేంజ్, ఫీచర్లు, టెక్నాలజీ వివరాలు
- EV Two-Wheeler Sales: భారత్ ఈవీ మార్కెట్లో సంచలనం.. టాప్-5 నుంచి ఓలా ఔట్..!
మిడ్ వేరియంట్లో కొత్త ఫీచర్లు
అప్డేట్ చేసిన Ronin మిడ్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.1,51,540. ఇందులో ప్రధానంగా కనెక్టెడ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ను జోడించారు. దీంతో బైక్‌లో మరిన్ని కనెక్టెడ్ ఫీచర్లను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అలాగే Type-C ఛార్జింగ్ పోర్ట్ ను కూడా అందించారు. మిడ్ వేరియంట్‌ను ఈ రెండు రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.. Glacier Silver, Charcoal Ember.
టాప్ వేరియంట్లో ట్రాక్షన్ కంట్రోల్
TVS Ronin టాప్ వేరియంట్లో మరింత ప్రీమియం ఫీచర్లను జోడించారు. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1,63,640. ఈ వేరియంట్లో ఇప్పుడు Traction Control System (TCS) అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు Type-C ఛార్జింగ్ పోర్ట్, కొత్త ప్రీమియం సీటును కూడా అందించారు. టాప్ వేరియంట్ కలర్ ఆప్షన్లు Nimbus Grey, Midnight Blue
TVS Ronin ప్రత్యేకత ఏమిటి?
TVS Ronin తన నియో-రెట్రో డిజైన్, రోడ్‌స్టర్ స్టైలింగ్‌తో TVS ప్రీమియం మోటార్‌సైకిల్ లైనప్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. TVS ప్రకారం, Ronin ఇప్పటికే 2 లక్షలకు పైగా కస్టమర్లను సొంతం చేసుకుని ఒక గ్లోబల్ కమ్యూనిటీగా ఎదిగింది. కొత్త Base+ వేరియంట్‌తో పాటు మిడ్, టాప్ వేరియంట్లలో అదనపు ఫీచర్లను అందించడం ద్వారా ఫెస్టివ్ సీజన్‌కు ముందు Ronin రేంజ్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చింది.
తాజావార్తలు
-
TVS Ronin Base+ Variant: TVS Ronin కొత్త Base+ వేరియంట్ లాంచ్.. తక్కువ ధరకే డ్యూయల్ ABS, అదనపు ఫీచర్లు
-
Haribabu Murder: ‘ఎస్.. నేనే చంపేశా’.. యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు హత్య కేసులో బిగ్ ట్విస్ట్..
-
MLA Gurajala Jaganmohan: హాట్ టాపిక్‌గా టీడీపీ ఎమ్మెల్యే వ్యవహారం.. కార్పొరేషన్ టికెట్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం
-
Scene: పోలీస్ ఆఫీసర్‌గా సూర్య మాస్ ఎంట్రీ.. జితు మాధవన్ తో ‘సీన్’ ఎలా ఉండబోతోందంటే?
-
Russia-NATO Tensions: రష్యా డ్రోన్లు, క్షిపణులతో NATO దేశాలపై దాడి చేయొచ్చు.. పోలాండ్ ప్రధాని టస్క్ హెచ్చరిక
ట్రెండింగ్
-
Shreyas Iyer: అది నేను ముందే ఊహించా.. ఆ ఐదుగురు సూపర్.. శ్రేయాస్ సంతోషం!
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!